కామెరాన్‌.. సూపర్‌మ్యాన్‌లా పట్టేశాడు..! | Sakshi
Sakshi News home page

కామెరాన్‌.. సూపర్‌మ్యాన్‌లా పట్టేశాడు..!

Published Tue, Nov 19 2019 4:40 PM

  మార్ష్‌ వన్డే కప్‌లో విక్టోరియాతో జరిగిన మ్యాచ్‌లో సౌత్‌ ఆస్ట్రేలియా పరుగు తేడాతో గెలిచింది. అత్యంత ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో సౌత్‌ ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 322 పరుగులు చేయగా, విక్టోరియా ఐదు వికెట్ల నష్టానికి 321 పరుగులే చేసి ఓటమి పాలైంది. విక్టోరియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ 119 పరుగులు చేసి మంచి ఆరంభాన్నిచ్చాడు. మూడో వికెట్‌కు హ్యాండ్‌స్కాంబ్‌తో కలిసి 147 పరుగులు చేయడంతో విక్టోరియా గెలుస్తుందనే అనుకున్నారంతా.  అయితే హ్యాండ్‌ స్కాంబ్‌(87) ఔటే విక్టోరియా కొంపముచ్చింది.

Advertisement
Advertisement