కేబినెట్‌ ముందుకు ‘సిట్‌’ నివేదిక | Sakshi
Sakshi News home page

కేబినెట్‌ ముందుకు ‘సిట్‌’ నివేదిక

Published Wed, Nov 7 2018 9:42 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నం భూ కుంభకోణంపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నివేదిక ఎట్టకేలకు మంత్రివర్గం ముందుకొచ్చింది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొం టున్న అధికార పార్టీకి చెందిన కీలక సూత్రధారులకు ‘సిట్‌’ క్లీన్‌చిట్‌ ఇచ్చేసింది. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన అనుచరులు, అధికార టీడీపీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్, పల్లా శ్రీనివాస్, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేశ్, వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేశ్‌తోపాటు ఇతర నేతల పాత్ర ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌ కనుసన్నల్లోనే విశాఖ భూకుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.