ఈ సీన్‌ ‘మణికర్ణిక’లో ఉంటే.. అదిరిపోయేది!

మణికర్ణిక విడుదలై ఒకవైపు పాజిటివ్‌ టాక్‌ను సంపాదించి.. కలెక్షన్లలో పుంజుకుంటుంటే.. మరోవైపు వివాదాలు కూడా వస్తున్నాయి. సినిమాలో మణికర్ణిక పాత్రలో నటించిన కంగనాకు ప్రశంసలు వస్తున్నాయి కానీ డైరెక్షన్‌ క్రెడిట్‌ పూర్తిగా తన అకౌంట్లో వేసుకోవడం మాత్రం దర్శకుడు క్రిష్‌కు మింగుడు పడటం లేదు. ఈ వివాదంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మణికర్ణిక విడుదలైన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను తీసిన సినిమా బంగారంలా ఉంటే ప్రస్తుతం చూస్తున్న సినిమా వెండిలా ఉందని.. కంగనా, సోనూసూద్‌ నటించిన పాత్రను తగ్గించాలని పట్టుబట్టిందన్నారు. కానీ తాను వినిపించుకోలేదని, కథలో తనకు ఇష్టవచ్చిన మార్పులు చేసిందని కంగనాపై ఆరోపణలు చేశారు. తాను ఈ సినిమా కోసం ఎంతో పరిశోధించానని, చరిత్రను వక్రీకరించడం తనకు ఇష్టం లేదని చెప్పారు. అయితే క్రిష్‌ ఈ సినిమా నుంచి తప్పుకున్నాక.. తన పాత్రను తగ్గిస్తామని చెప్పేసరికి సోనూసూద్‌ కూడా ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతుంటే.. సోనూసూద్‌పై షూట్‌ చేసిన ఓ సన్నివేశం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సినిమా ఎండింగ్‌ వరకు ఆయన పాత్ర ఉంటుందని, సోనూసూద్‌పై తీసిన సన్నివేశాలు ఎంతో బాగుంటాయని క్రిష్‌ చెప్పడం.. ఒళ్లు గగుర్పొడిచే ఈ సీన్‌ లీక్‌ అవ్వడం చూస్తే.. కంగనా కావాలనే సోనూసూద్‌ పాత్రను తగ్గించినట్లుందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. సోనూసూద్‌ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాక.. మహ్మద్ జీషన్ తో రీ షూట్ చేసింది. ఆ పాత్రను పూర్తిగా మార్చేయడంతో పెద్దగా ప్రాముఖ్యత లేకుండాపోయింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top