జనవరి 20నే ప్రమాణం ఎందుకు? | Sakshi
Sakshi News home page

జనవరి 20నే ప్రమాణం ఎందుకు?

Published Fri, Jan 20 2017 7:14 AM

లీప్‌ సంవత్సరం నవంబర్‌లో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన అభ్యర్థి జనవరి 20న ప్రమాణం చేసే సంప్రదాయం 1937లో ఆరంభమైంది. దేశ 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి.రూజ్వెల్ట్‌ రెండోసారి 1936లో ఎన్నికయ్యాక జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు వరకూ మార్చి4న కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేయడం సంప్రదాయంగా 140 ఏళ్లు కొనసాగింది. ఎఫ్‌డీ రూజ్వెల్ట్‌ తొలిసారి 1932లో గెలిచి మార్చి4న ప్రమాణం చేశారు. ఇలా ఆయన మార్చి4న ప్రమాణం చేసిన చివరి అధ్యక్షునిగా, జనవరి 20న పదవీ స్వీకారం చేసిన తొలి దేశాధినేతగా చరిత్రకెక్కారు.

Advertisement
Advertisement