కెన్యాతో రక్షణ బంధం | Sakshi
Sakshi News home page

కెన్యాతో రక్షణ బంధం

Published Tue, Jul 12 2016 6:27 AM

పలు రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవటంతో పాటు విస్తరించాలని భారత్, కెన్యా నిర్ణయించాయి. అందులో భాగంగా రక్షణ, భద్రత రంగం, ద్వంద్వ పన్నుల రద్దు సహా ఏడు ఒప్పందాలు చేసుకున్నాయి. ఆఫ్రికా పర్యటనలో భాగంగా కెన్యా వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ.. సోమవారం ఆ దేశాధ్యక్షుడు ఉహురు కెన్యెట్టాతో చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. కెన్యాలో చిన్న, మధ్య తరహా సంస్థలు, జౌళి పరిశ్రమల అభివృద్ధికి సాయంగా రాయితీతో కూడిన రుణాన్ని రూ. 302 కోట్లకు పెంచుతున్నట్లు మోదీ తెలిపారు.