కృష్ణా జలాలు తాగు అవసరాలకే | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాలు తాగు అవసరాలకే

Published Tue, Aug 4 2015 7:15 AM

ప్రధాన జలాశయాలు అడుగంటిన దృష్ట్యా కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి వినియోగానికే పరిమితం చేయాలని కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూప్ నిర్ణయించింది. సాగు అవసరాలకు నీటిని మళ్లించకుండా చూడాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాలపై ఉంటుందని స్పష్టం చేసింది. తాగునీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకోవాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టుల్లో నీరు చేరేవరకు ఖరీఫ్ సాగు అవసరాలను పక్కనపెట్టాలని... ఈ దిశగా రైతులను అప్రమత్తం చేయాలని సూచించింది. కృష్ణాలో ఉన్న కొద్దిపాటి జలాలను తెలంగాణ, ఏపీ రాష్ట్రాల తాగునీటి అవసరాలకు ఏవిధంగా పంచుకోవాలన్న అంశంపై సోమవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్‌కేజీ పండిత్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు వెంకటేశ్వరరావు, మురళీధర్‌లతో కూడిన వర్కింగ్ గ్రూప్ కేంద్ర జల సంఘం కార్యాలయంలో సమావేశమై చర్చించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement