కరెన్సీ కష్టం..800 కోట్ల నష్టం | Sakshi
Sakshi News home page

కరెన్సీ కష్టం..800 కోట్ల నష్టం

Published Wed, Jan 4 2017 7:30 AM

రాష్ట్రంలో కరెన్సీ కష్టాలు ఇంకా తీరలేదు. నోట్ల రద్దు నిర్ణయం అమల్లోకి వచ్చి 54 రోజులు కావొస్తున్నా జనానికి సరిపడినంత నగదు అందడం లేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నుంచి ఆశించినంత నగదు రాష్ట్రానికి రాకపోవటంతో ప్రజలు ఇంకా నానా ఇబ్బందులు పడుతున్నారు. నగదు విత్‌డ్రాలపై ఆర్‌బీఐ ఆంక్షలు కొనసాగుతుండటంతోపాటు బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రజలు బ్యాంకుల్లో జమ చేసిన తమ డబ్బును తిరిగి డ్రా చేసుకోలేకపోతున్నారు. డిపాజిట్‌ చేసిన డబ్బులో కనీసం మూడోవంతు నగదును కూడా ఆర్‌బీఐ రాష్ట్రానికి కేటాయించలేదు. దీంతో పరిమితికి లోబడి రూ.24 వేలు డ్రా చేసుకునేందుకు వెళ్తున్న ఖాతాదారులు సైతం నిరాశతో వెనుదిరుగుతున్నారు. రూ.10 వేలకు మించి ఇవ్వలేమంటూ బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు.