Sakshi News home page

దేవదాయ మంత్రికి ఆశీస్సులు

Published Sat, Dec 16 2023 4:28 AM

ప్రవీణ్‌ను సన్మానిస్తున్న అధ్యాపకులు - Sakshi

వర్గల్‌(గజ్వేల్‌): రాష్ట్ర దేవదాయ, ధర్మదాయశాఖ మంత్రి కొండా సురేఖను శుక్రవారం నాచారం గుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం సహాయ కమిషనర్‌ ఎస్‌.అన్నపూర్ణ ఆధ్వర్యంలో అర్చకులు, సిబ్బంది కలిశారు. హైదరాబాద్‌లో మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి స్వామి ఆశీస్సులు, శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. అర్చకులు మహదాశీర్వచనం చేశారు.

శిఖరాన్ని అధిరోహించడం అభినందనీయం

సిద్దిపేట ఎడ్యుకేషన్‌: జమ్మూకశ్మీర్‌లోని ఎత్తయిన శిఖరం మౌంట్‌ను అధిరోహించడం అభినందనీయమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రసాద్‌ అన్నారు. ఇటీవల కళాశాల విద్యార్థి ప్రవీణ్‌కుమార్‌ జమ్మూకాశ్మీర్‌లోని 17,800 ఫీట్ల ఎతైన శిఖరం మౌంట్‌ను అధిరోహించాడు. దీంతో ఆ విద్యార్థిని శుక్ర వారం అధ్యాపకులు డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ పల్లవి, డాక్టర్‌ అయోధ్యరెడ్డి, డాక్టర్‌ శ్రద్ధానందం తదితరులు అభినందించారు.

ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే

సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి

చేర్యాల(సిద్దిపేట): రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల తరుఫున పోరాడేది కమ్యూనిస్టులు మాత్రమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాళ్లబండి శశిధర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి, కొంగరి వెంకట్‌ మావో, బద్దిపడగ కృష్ణారెడ్డి, చొప్పరి రవి కుమార్‌, దాసరి ప్రశాంత్‌, అత్తిని శారద, తేలు ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై

‘ఇందూరు’లో వర్క్‌షాప్‌

సిద్దిపేటఅర్బన్‌: పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎంబీఏ విద్యార్థులకు శుక్రవారం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌పై ఒకరోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సైకాలజిస్ట్‌ కన్సల్టింగ్‌ గ్రూపు ప్రొఫెసర్‌ రవికాంత్‌ మాట్లాడుతూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ఒక వ్యక్తి తన ప్రేరణను, వ్యవస్థాపక పాత్రను సమర్థవంతంగా పోషించడానికి అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలను పొందడంలో సహాయపడడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ ప్రోగ్రాం ఎంబీఏ విద్యార్థుల కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీపీ రాజు అన్నారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బెనర్జీ, ఎంబీఏ హెచ్‌ఓడీ రహీంసుల్తానా, పీఆర్వో రఘు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement