Sakshi News home page

సమస్యల పరిష్కారమే లక్ష్యం

Published Wed, Mar 27 2024 7:35 AM

-

ఇబ్రహీంపట్నం: విద్యారంగ సమస్యల పరిష్కారమే ఎస్‌ఎఫ్‌ఐ లక్ష్యమని, దీని కోసం నిరంతర పో రాటం చేస్తుందని జిల్లా కార్యదర్శి శంకర్‌ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరిస్మారక కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో డివిజన్‌ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ.. ృ విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. సకాలంలో స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. బకాయిలపై తాము ఉద్యమించనున్నట్లు తెలిపారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల ఫీజు దోపిడీ రోజురోజుకు పెరుగుతున్నాయని

మండిపడ్డారు.

ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ నూతన కమిటీ..

డివిజన్‌ నూతన అధ్యక్షుడిగా వంశీ, కార్యదర్శిగా తరంగ్‌, ఉపాధ్యక్షుడిగా శ్రీకాంత్‌, విప్లవ్‌, రాకేష్‌, అభిలాష్‌, సహాయ కార్యదర్శులుగా లక్ష్మణ్‌, రాకేష్‌, వినయ్‌, మోబిన్‌తోపాటు కమిటీ సభ్యులను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.

జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి శంకర్‌

Advertisement

What’s your opinion

Advertisement