Sakshi News home page

డివైడర్‌ను బైక్‌ఢీకొని యువకుడి మృతి

Published Tue, Mar 26 2024 1:45 AM

-

మాచారెడ్డి: మండల కేంద్రంలోని ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం ప్రాంతానికి చెందిన తన్నీరు వెంకటరాంబాబు(23) కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఉంటూ సోలార్‌ ప్లేట్లు బిగించే పనిచేస్తున్నాడు. ఆదివారం కామారెడ్డి కోర్టులో సోలార్‌ ప్లేట్లు బిగించారు. ఆదివారం రాత్రి సమయంలో తన స్నేహితులైన చరణ్‌కుమార్‌రెడ్డి, వెంకటేశ్వర్లుతో కలిసి బైక్‌పై కరీంనగర్‌ పయనమయ్యాడు. ఈ క్రమంలో బైక్‌ మండల కేంద్రంలో డివైడర్‌ను ఢీకొనగా రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు, చరణ్‌కుమార్‌రెడ్డికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బెల్ట్‌షాపులపై దాడి

రుద్రూర్‌/బోధన్‌ రూరల్‌: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్‌షాపులో పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు.రుద్రూర్‌ మండల కేంద్రంలోని అంబం(ఆర్‌)ఎక్స్‌ రోడ్డు సమీపంలోని హోటల్‌పై దాడి చేసి రూ.2,277 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై అప్పారావు తెలిపారు. హోటల్‌ యజమాని గంగాధర్‌పై కేసు నమోదు చేశామన్నారు. బోధన్‌ మండలం అమ్దాపూర్‌ గ్రామంలోని బెల్ట్‌షాపులపై దాడి చేసిరూ. 9వేల విలువైన బాటిళ్లను స్వాధీనం చేసకున్నామని ఎస్సై నాగనాథ్‌ తెలిపారు.బెల్ట్‌షాపుల నిర్వాహకులపై కేసులునమోదు చేశామన్నారు.

పేకాటస్థావరంపై దాడి

దోమకొండ: మండలంలోని సంగమేశ్వర్‌ గ్రామ శివారులో కొనసాగుతున్న పేకాటస్థావరంపై సోమవారం దాడి చేసి ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై గణేశ్‌ తెలిపారు. పట్టుబడిన వారి నుంచి రూ.6,410 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. ఎక్కడైనా పేకాటస్థావరాలు కొనసాగితే తమకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.

Advertisement

What’s your opinion

Advertisement