Horoscope Today: Daily Rasi Phalalu February 6, 2022 In Telugu - Sakshi
Sakshi News home page

Daily Horoscope: ఈ రాశివారికి వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి

Published Sun, Feb 6 2022 6:01 AM

Today Horoscope In Telugu 06-02-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి శు.పంచమి ఉ.7.05 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం రేవతి రా.8.30 వరకు తదుపరి అశ్వని, వర్జ్యం ఉ.8.05 నుండి 9.44 వరకు, దుర్ముహూర్తం సా.4.21 నుండి 5.06 వరకు అమృతఘడియలు... సా.5.59 నుండి 7.36 వరకు.

సూర్యోదయం        :  6.35
సూర్యాస్తమయం    :  5.53
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల విషయంలో చికాకులు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి.

వృషభం: మీ శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. భూ, వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మిథునం: సన్నిహితులు, మిత్రులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులతో విరోధాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

సింహం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు చిక్కులు.

కన్య: రుణబాధల నుండి విముక్తి. సంఘంలో పరపతి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృశ్చికం: రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.

ధనుస్సు: అనుకున్న డబ్బు సమకూరడంలో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు దక్కవచ్చు.

కుంభం: సన్నిహితులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

మీనం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటాయి.

Advertisement
Advertisement