Sakshi News home page

రెండు రోజుల్లో బిల్లులు అప్‌లోడ్‌ చేయండి

Published Fri, Mar 29 2024 1:45 AM

-

అనంతపురం సిటీ: మరో రెండు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన బిల్లులన్నీ వెంటనే అప్‌లోడ్‌ చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ కృష్ణారెడ్డి ఆదేశించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల అధికారులతో గురువారం అనంతపురంలోని రీజినల్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద సబ్‌ డివిజన్ల వారీగా మంజూరైన, చేపట్టిన, పూర్తయిన పనులపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ గడువులోపు పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులు అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఏమాత్రం జాప్యం చేయరాదన్నారు. గ్రామ సచివాలయాలు, డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో వంద శాతం పూర్తి చేసి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన శింగనమల, అనంతపురం రూరల్‌ డీఈఈ రాచంరెడ్డి భాస్కర్‌రెడ్డిని అభినందించారు.కార్యక్రమంలో అనంతపురం పీఆర్‌ ఎస్‌ఈ ఈరాస్వామి, ఈఈ చంద్రశేఖర్‌, డీఈఈలు రాచంరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా పీఆర్‌ హెడ్‌ మురళీ, పీఏలు గురుమూర్తి, శ్రీనివాసమూర్తి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు రాజన్న, మురళీ, రాజనీకాంత్‌, వెంకటరమణ, హరి, మధు, మల్లికార్జున, ఏఈ హుస్సేన్‌బాషా, లక్ష్మీదేవి, తదితరులున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement