Sakshi News home page

నేడు

Published Thu, Mar 28 2024 12:50 AM

- - Sakshi

నాడు

టీడీపీ హయాంలో ప్రత్యామ్నాయ విత్తనం కోసం డీసీఎంఎస్‌ కార్యాలయం వద్ద ఎండలోనే బారులు తీరిన రైతులు వీరు. ఇదొక్క ఫొటో చాలు చంద్రబాబు హయాంలో అన్నదాతలు ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పడానికి. అప్పట్లో విత్తనాలు కావాలంటే రోజుల తరబడి శ్రమించాల్సిన దుస్థితి. మండల, డివిజన్‌, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే పంపిణీ కేంద్రాలకు రెండు మూడు రోజులు తిరిగితే కానీ విత్తనాలు దక్కేవి కాదు. అది కూడా ఇంటిల్లిపాదీ వెళ్లాల్సిన పరిస్థితి. కొందరు రైతులు రాత్రిళ్లు, తెల్లవారు జామునే పంపిణీ కేంద్రాలకు చేరుకుని క్యూలలో తమ వంతుగా చెప్పులు పెట్టి అక్కడే పడుకునే వారు కూడా. చార్జీలు, రవాణా, భోజన ఖర్చులు, ఇతరత్రా శ్రమ అంతాఇంతా కాదు. ఒక్కోసారి పోలీసులతో తన్నులు కూడా తినాల్సి వచ్చేది. నాడు విత్తనాల కోసం రైతుల చేసిన పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. – అనంతపురం అగ్రికల్చర్‌:

ఇది గత ఏడాది గార్లదిన్నె మండలంలోని ఓ గ్రామంలో స్థానికంగా ఉండే ఆర్‌బీకే వేదికగా రైతులకు విత్తన పంపిణీ చేస్తున్న దృశ్యం. 2019 మేలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా 2020 మే 30న గ్రామ గ్రామాన అన్నదాతల కోసం రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు) ఏర్పాటు చేశారు. రైతులు గ్రామం దాటి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆర్‌బీకేల్లోనే విత్తనం, ఎరువులు, ఇతరత్రా ఇన్‌పుట్స్‌ అందించేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో రైతుల ఖర్చులు, శ్రమ బాగా తగ్గిపోయాయి. అనుకున్నదే తడువుగా విత్తనం, ఎరువులు తీసుకుంటూ సాఫీగా సేద్యం పనులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం రాయితీ కిందే కాకుండా నాన్‌సబ్సిడీ కింద కూడా విత్తనాలు ఇస్తున్నారు. నూతన వ్యవసాయ విప్లవానికి నాంది పలకడంతో అన్నదాత ఇంట హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.

బాబు జమానాలో అన్నదాతకు

చెప్పనలవిగా విత్తన కష్టాలు

నేడు గ్రామంలోనే ఆర్‌బీకేలో సాఫీగా విత్తనం

Advertisement

What’s your opinion

Advertisement