-
తెలంగాణకు ఏం చేశారో చెప్పండి
కరీంనగర్ కార్పొరేషన్: పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమిటో ఆ పార్టీ నేతలు చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై బీజేపీ నేతలు చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. రాష్ట్రానికి చేసిందేమిటో సమాధానం చెప్పాకే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు ఓట్లు అడగాలన్నారు. ఆంబేడ్కర్ జయంతి సందర్భంగా పదేళ్ల బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఆదివారం కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడుగుతున్నారని, తాము అధికారంలోకొచ్చి నాలుగు నెలలే అయిందని, అంతకుముందు పదేళ్లు అధికారంలో ఉండి అమలు చేయని హామీల మాటేమిటని ప్రశ్నించారు. బీజేపీ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేసేందుకే ఈ నిరసన దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. నల్లధనాన్ని బయటకు తీసి ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతులకు పింఛన్ ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్ర విభజన హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. గతంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన పరిశ్రమలను మోదీ ప్రైవేట్ పరం చేస్తూ అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. డిపాజిట్లు రాని బీజేపీతో కాంగ్రెస్‌కు పోటీ ఏంటి? బీజేపీకి 2014లో 105 సీట్లలో డిపాజిట్లు కూడా రాలేదని, 2018లో 100 సీట్లలో, 2023లో 70కి పైగా సీట్లలో డిపాజిట్ రాలేదని, అలాంటి బీజేపీకి కాంగ్రెస్‌తో పోటీనా అని పొన్నం వ్యాఖ్యానించారు. మోదీ ఫొటోతో ఓట్లు రావని బీజేపీ నేతలకు కూడా తెలుసని అందుకే రాముడి ఫొటోలతో ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. దీక్షలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి పాల్గొన్నారు. -
గాంధీభవన్, తెలంగాణ భవన్ వద్ద మంత్రి పొన్నం దీక్ష చేయాలి
కథలాపూర్ (వేములవాడ/వేములవాడ అర్బన్ ): వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినందుకు గాంధీభవన్ వద్ద, కేసీఆర్ పదేళ్లు ప్రజలను అరిగోస పెట్టినందుకు మంత్రి పొన్నం తెలంగాణ భవన్ వద్ద దీక్ష చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ సవాల్ విసిరారు. శుక్రవారం కథలాపూర్ మండల కేంద్రంలో బండి సంజయ్ మాట్లాడారు. అంతకుముందు రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకెపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం రైతులను కలిసి వారు పడుతున్న కష్టాలు తెలుసుకున్నారు. ఇకనై నా కాంగ్రెస్ నాయకులు పనికిమాలిన మా టలు మానుకుని ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. పొన్నం దీక్ష ఎందుకోసమో చెప్పాలి పొన్నం దీక్ష చేసేది కరోనా సమయంలో ప్రధాని మోదీ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకా? లేక కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి రూ. 12 వేల కోట్ల నిధులిచ్చినందుకా? లేదా కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేసినందుకా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్లో కాంగ్రెస్‌కు ఎంపీ అభ్యర్థి కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సత్యనారాయణరావు, ప్రతాప రామకృష్ణ, వేములవాడ నియోజకవర్గ బాధ్యులు చెన్న మనేని వికాశ్రావు, తదితరులు పాల్గొన్నారు. -
Ponnam Prabhakar: 14న కరీంనగర్లో దీక్ష చేస్తాం
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఈనెల 14న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దీక్ష చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో దీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ ఫిషర్మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి, అధికార ప్రతినిధి కోట శ్రీనివాస్‌లతో కలిసి మంత్రి పొన్నం మాట్లాడారు. గత పదేళ్లలో తెలంగాణకు ఏమీ చేయకుండా విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెర వేర్చకుండా ఏ మొహం పెట్టు కుని బీజేపీ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లడుగుతారని వారు ప్రశ్నించారు. దేశంలోని నవరత్నాల కంపెనీలను అమ్మే స్తున్న బీజేపీకి ఒక ఎజెండా లేదని, కేవలం రాము డుపేరిట అక్షింతలు, కుంకుమలను ప్రజలకిచ్చి ఓట్లడుగుతున్నారని మండిపడ్డారు. దళితులు, బీసీలు, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమంలో యువత బలిదానాలను బీజేపీ అవహేళన చేసిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్య లకు బీజేపీనే కారణమని విమర్శించారు. కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి ఎవరన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. -
బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం
-
టచ్ చేసి చూడండి..ఏం జరుగుతుందో!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని మొన్నటివరకు బీఆర్ఎస్ పాట పాడిందని.. ఇప్పుడు బీజేపీ నేతల నోట అదే పాట వినిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యా నించారు. తలచుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామన్న బీజేపీ ఎమ్మెల్యే ఏలే టి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడండి.. ఏం జరుగుతుందో’అని హెచ్చరించారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, తమను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. పొన్నం శనివారం గాం«దీభవన్‌లో టీపీసీసీ నేతలు నిజాముద్దీన్, కోట్ల శ్రీనివాస్ తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడానికి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఏమైనా జ్యోతిష్యం చదువుకున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు బీసీని అధ్యక్షుడ్ని చేయండి లోక్‌సభ ఎన్నికల్లో బీసీలకు టికెట్ల కేటాయింపుపై మంత్రి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరమని పొన్నం విమర్శించారు. బీఆర్ఎస్ ఏర్పాటైన 23 ఏళ్లలో ఒక్క బీసీ నేత అయినా ఆ పారీ్టకి అధ్యక్షుడయ్యారా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యాక అయినా, లేక ఎన్నికల్లో ఓడిపోయాక అయినా బీసీలకు అధ్య క్ష పదవి ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభాపక్ష నేత, ప్రతిపక్ష నేత, మండలిలో ప్రతిపక్ష నేత.. ఇలా ఏ పదవిని కూడా బీసీలకు ఇవ్వకుండా.. బీసీలను ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడటం ఏమిటని నిలదీశారు. తమ ప్రభుత్వం కులగణన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసి, రూ.150 కోట్లు నిధులు ఇచి్చందని, 17 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. కాంగ్రెస్‌తోనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పారీ్టలో బీసీలకు అన్యాయం జరిగితే పారీ్టలో అంతర్గతంగా అడుగుతామని, బీఆర్ఎస్లో అలా అడిగే స్వేచ్ఛ కొంచెమైనా లేదని విమర్శించారు. బీసీని అధ్యక్ష పదవి నుంచి తీసేసి.. బలహీనవర్గాల నాయకుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేసిన బీజేపీ.. బీసీ నేతను సీఎం చేస్తామని చెప్పడం ఏమిటని పొన్నం నిలదీశారు. అవినీతి చేసినందుకే బండి సంజయ్‌ను తీసేశామని కిషన్‌రెడ్డి వర్గం చెప్తుంటే.. కిషన్‌రెడ్డిని కేసీఆర్ నియమించుకున్నారని బండి సంజయ్ వర్గం అంటోందని వ్యాఖ్యానించారు. కాగా.. మంత్రులు టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు అంటున్నారని మీడియా ప్రస్తావించగా.. తనను అలాంటి చర్యకు పాల్పడాలని అడిగే ధైర్యం ఎవరికీ లేదని, కలలో కూడా బీజేపీ ఊసెత్తనంటూ మంత్రి పొన్నం మీసం మెలి తిప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
వెళ్తూ వెళ్తూ...!
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
కేకేఆర్‌తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement