-
యూపీ బోర్డు పేపర్ లీక్ ప్రధాన నిందితుడు అరెస్ట్!
ఉత్తరప్రదేశ్ బోర్డు 12వ తరగతి పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు వినయ్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 12వ తరగతి బయాలజీ, మ్యాథమెటిక్స్ పేపర్ల ఫోటోలను నిందితుడు వినయ్ వాట్సాప్ గ్రూప్‌లో వైరల్ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 29న యూపీ బోర్డు సెకండ్ షిఫ్ట్ పరీక్షలో 12వ తరగతికి చెందిన రెండు పేపర్లు లీక్ అయ్యాయి. ఆగ్రాలోని శ్రీ అతర్ సింగ్ ఇంటర్ కాలేజీలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ వినయ్ చౌదరి 12వ తరగతి బయాలజీ, మ్యాథమెటిక్స్ పేపర్ ఫొటోలను ‘ఆల్ ప్రిన్సిపల్స్ ఆగ్రా’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. 12వ తరగతి పేపర్ లీక్ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పేపర్ లీక్ అయిన ఆగ్రాలోని సదరు కళాశాల గుర్తింపును రద్దు చేశారు. యూపీ బోర్డు సమావేశంలో శ్రీ అతర్ సింగ్ ఇంటర్ కాలేజ్ రోజౌలీ గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వినయ్ చౌదరి, స్కూల్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రాజేంద్ర సింగ్, అదనపు సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గంభీర్ సింగ్, స్టాటిక్ మేజిస్ట్రేట్ గజేంద్ర సింగ్‌లపై ఫిబ్రవరి 29 న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే సెంటర్ నిర్వాహకుడు రాజేంద్ర సింగ్‌తో పాటు మరొక వ్యక్తిని కూడా అరెస్టు చేసి, జైలుకు తరలించారు. -
మేనకోడలిపై మోహంతో భార్యపై వేధింపులు.. చివరికి ఏమైందంటే?
లక్నో: యూపీలోని బుడౌన్ బుడౌన్‌లో ఓ మహిళా దారుణానికి ఒడిగటింది. తాగొచ్చి తన మేనకోడలిని లొంగదీసుకునే ప్రయత్నిస్తూ తనని తరచూ వేదిస్తున్నందుకు అతడి భార్య మిథ్లేశ్ దేవి(40) భర్త గొంతు కోసి చంపేసింది. కేసు దర్యాప్తు చేసిన యూపీ పోలీసులు చాకచక్యంగా అసలు నిజాన్ని రాబట్టారు. బుడౌన్‌లో ఆట వస్తువులను తయారు చేసే తేజేంద్ర సింగ్(43) ఆగస్టు 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బిల్సి పట్టణంలోని తన ఇంటి ప్రాంగణంలో నిద్రిస్తున్న తేజేంద్ర సింగ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన కుటుంబ సభ్యులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొదటి నుంచి తేజేంద్ర సింగ్ భార్య తడబడుతూ ఒకదానితో ఒకటి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానమొచ్చిందని తర్వాత ఆమెను విడిగా విచారణ చేయగా హత్య తానే చేసినట్లు అంగీకరించిందని తెలిపారు. తన మేనకోడలిని లొంగదీసుకోవడానికి తేజేంద్ర ప్రయత్నించేవాడని తనని ఒప్పించమని తరచూ వేధించేవాడని భర్త వేధింపుల నుండి విముక్తి పొందాలని ఎప్పటినుంచో అవకాశం కోసం ఎదురు చూస్తుండగా ఓ రోజు అతడు బాగా మద్యం సేవించి రావడంతో నిద్రిస్తున్న సమయంలో కొడవలితో గొంతు కోసి చంపినట్లు మిథ్లేశ్ దేవి నేరాన్ని అంగీకరించిందని వివరించారు బుడౌన్ ఎస్పీ ఓపీ సింగ్. ఇది కూడా చదవండి: HYD: మద్యం మత్తులో సీఐ కారు బీభత్సం.. -
అతీక్, అతని సోదరుడిపై ఉన్న 152 కేసులు క్లోస్!
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు ఖాలిద్ అజీమ్(అశ్రఫ్) ఏప్రిల్ 15న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇద్దరూ మరణించడంతో వీరిపై ఉన్న 152 పెండింగ్ కేసులను క్లోస్ చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు నిర్ణయించారు. ఈ ఇద్దరి డెత్ రిపోర్టును కోర్టుకు సమర్పించి కేసులన్నీ మూసివేయనున్నారు. 152 కేసుల్లో అతీక్పైనే 102 కేసులున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈకేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో ఒక్క కేసులో మినహా అతీక్ ఎందులోనూ దోషిగా తేలలేదు. బెదిరింపులు, ప్రలోభాలతో శిక్ష పడకుండా చూసుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా అతీక్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇతనితో పాటు అనుచరులపైనా యూపీలోని యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. రౌడీ షీటర్లను ఎన్కౌంటర్లలో కాల్చిపడేసింది. వాళ్ల ఇళ్లను కూడా కూల్చివేసింది. అతీక్‌పై 1979లోనే తొలిసారి హత్య కేసు నమోదైంది. అప్పుడు అతని వయసు 15 ఏళ్లే కావడం గమనార్హం. అలాగే అతని సోదరుడు అశ్రఫ్పై 1992లో తొలి కేసు నమోదైంది. వీరిద్దరిపై చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్‌పాల్ హత్యకు సంబంధించిన కేసు నమోదైంది. కాగా.. అతీక్, అతని సోదరుడిపై ఉన్న కేసులు క్లోస్ చేస్తున్నప్పటికీ వీటిలో ఇతర నిందితులపై అభియోగాలు అలాగే ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. న్యాయపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. చదవండి: బ్రిడ్జిపైనుంచి పడిపోయిన బస్సు.. 14 మంది దుర్మరణం.. 20 మందికి గాయాలు -
ఊరేగింపుగా ఎందుకు తీసుకెళ్లారు ?
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్ కస్టడీలో ఉండగా పోలీసుల కళ్లెదుటే హత్యకు గురైన ఘటనపై సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా పోలీసులు, యూపీ సర్కారుకు పలు ప్రశ్నలు సంధించింది. ‘ అతీక్‌ను ఆస్పత్రికి తీసుకొస్తారని నిందితులకు ముందే ఎలా తెలుసు ? మేం కూడా టీవీలో చూశాం. ఆస్పత్రి గేటు నుంచి వారిని లోపలికి అంబులెన్స్‌లో ఎందుకు తీసుకెళ్లలేదు. మీడియా సమక్షంలో వారిని ఎందుకు ఊరేగింపుగా నడిపిస్తూ తీసుకెళ్లారు?. అతీక్ పోలీసు కస్టడీలో ఉండగా మీడియా చూస్తుండగా షూటర్లు హత్యకు ఎలా తెగించగలిగారు?’ అని యూపీ సర్కార్ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ప్రశ్నించింది. దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విద్వేష ప్రసంగాలపై కేసులు నమోదుచేయండి న్యూఢిల్లీ: దేశంలో మత సామరస్యానికి తీవ్ర భంగం వాటిల్లేలా విద్వేష ప్రసంగాలు చేసే వారిపై సుమోటో కేసులు నమోదుచేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. లేదంటే కోర్టు ధిక్కార చర్య తప్పదని డీజీపీలను హెచ్చరించింది. -
యూపీ పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాపియా, క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అయితే యూపీ పోలీసులు తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల జాబితాలో ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు చెందినవారు. హత్య, బెదిరింపులు, భూ కబ్జాలు వంటి తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉన్నారు. ఈ లిస్టులో టాప్‌లో ఉన్న వారిలో డాన్ నుంచి పొలిటీషియన్‌గా మారిన ముఖ్తర్ అన్సారీ, విజయ్ మిశ్రా, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే హాజి యాకూబ్ ఖురేషి, బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ హాజి ఇక్బాల్, మాజీ ఎమ్మెల్సీ బ్రిజేష్ సింగ్, ఎస్పీ మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్, బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ ద్వివేది, సుధీర్ సింగ్, దిలీప్ విశ్రా ఉన్నారు. కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా నేర చరిత్ర ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నట్లు లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న 66 మంది నేరగాళ్లపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. వీరిపై ఉన్న కేసులు త్వరగా విచారణ పూర్తయ్యేలా చూసి కోర్టులో శిక్ష పడేలా చేస్తామన్నారు. ఈ 66 మందిలో అతీక్ అహ్మద్, అదిత్య రాణా ఇప్పటికే చనిపోయారని, 27 మంది జైలులో ఉన్నారని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఐదుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. కొందరిపై రూ.లక్షకుపైగా రివార్డు కూడా ఉన్నట్లు వివరించారు. చదవండి: మోదీ ఇంటి పేరు వివాదం.. రాహుల్ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్‌రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్‌లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
క్లుప్తంగా
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement