-
వరల్డ్ ఒలింపిక్స్ చారిత్రక నిర్ణయం
ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేతలకు నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించింది. వ్యక్తిగత, రిలే విభాగాల్లో (48 ఈవెంట్స్) స్వర్ణాలు గెలిచే వారికి 50,000 అమెరికన్ డాలర్లు ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది పారిస్‌లో జరుగబోయే ఒలింపిక్స్ నుంచి స్వర్ణ పతక విజేతలకుప్రైజ్‌మనీ పంపిణీ అమల్లోకి వస్తుందని తెలిపింది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ నుంచి రజత, కాంస్య పతక విజేతలకు కూడా ప్రైజ్‌మనీ అందిస్తామని పేర్కొంది. నాలుగేళ్లకు ఒకసారి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి వచ్చే ఆదాయ వాటాతో (2.4 మిలియన్ల అమెరికన్ డాలర్లు) నగదు బహుమతులు ఇస్తామని వెల్లడించింది. ఒలింపిక్స్‌లో ప్రైజ్ మనీ అందజేసే తొలి అంతర్జాతీయ సమాఖ్య తమదేనని వరల్డ్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో ప్రకటించారు. -
జర్నలిజంలో గోపాలకృష్ణకు గోల్డ్ మెడల్
జర్నలిజంలో విస్తృత పరిశోధన చేసిన గోపాలకృష్ణకు గోల్డ్‌మెడల్ లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆధ్యాత్మిక పత్రికలు - భాష, విషయ విశ్లేషణ అన్న అంశంపై M Phil పరిశోధన చేసిన సీనియర్ జర్నలిస్ట్ మల్లాది వెంకట గోపాలకృష్ణకు శ్రీ బొప్పన్న స్మారక స్వర్ణ పథకం లభించింది. రవీంద్ర భారతిలో జరిగిన విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళసై చేతుల మీదుగా గోపాలకృష్ణ స్వర్ణ పథకాన్ని అందుకున్నారు. జర్నలిజం కమ్యూనికేషన్ థియరీస్, ఆధ్యాత్మికత, తెలుగు భాష అనే నాలుగు విస్తృతమైన పరిధి కలిగిన రంగాలను మేళవించి, ప్రతిపాదనలు చేసి శాస్త్రబద్ధంగా ఆ ప్రతిపాదనను నిరూపించినందుకు గాను మల్లాది పరిశోధన స్వర్ణ పథకానికి ఎంపికయింది. సబ్ ఎడిటర్ కం రిపోర్టర్ గా వృత్తి జీవితాన్ని మొదలుపెట్టి పలు ఛానళ్లు, పత్రికల్లో పని చేసిన మల్లాది తనదైన శైలిలో ప్రతిభను కనబరిచారు. కవి, రచయిత, భాషావేత్తగా, అనువాదకుడు. బోధకుడిగా నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా రాణించారు. పరిశోధన రంగంలో విస్తృతంగా పని చేసిన మల్లాదిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు తంగడి కిషన్ రావు, రిజిస్ట్రార్, గైడ్ ఆచార్య కడియాల సుధీర్ కుమార్, ఆచార్య వెంకటరామయ్య అభినందించారు. పథకాలు అందుకున్న పరిశోధక విద్యార్థిని విద్యార్థులందరికీ గవర్నర్ తమిళసై శుభాకాంక్షలు తెలిపారు. -
గుల్వీర్ సింగ్ స్వర్ణం వెనక్కి...
ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పురుషుల 3000 మీటర్ల విభాగంలో తాను గెల్చుకున్న స్వర్ణ పతకాన్ని భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ కోల్పోయాడు. టెహ్రాన్‌లో జరిగిన ఈ ఈవెంట్లో గుల్వీర్ రేసు సందర్భంగా తాను పరిగెడుతున్న వరుస నుంచి పక్క వరుసలోకి వెళ్లినట్లు తేలడంతో అనర్హత వేటు వేశారు. నిర్వాహకుల నిర్ణయాన్ని భారత బృందం అప్పీల్ చేయగా.. గుల్వీర్ నిబంధన లకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తేలడంతో అప్పీల్‌ను కొట్టివేశారు. -
జ్యోతి యర్రాజీకి స్వర్ణం
టెహ్రాన్ (ఇరాన్): ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం గెలుచుకుంది. మహిళల 60 మీటర్ల హర్డిల్స్‌ను 8.12 సెకన్లలో పూర్తి చేసి జ్యోతి మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో గత ఏడాది తానే నెలకొల్పిన 8.13 సెకన్ల జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టడం విశేషం. ఈ ఈవెంట్ హీట్స్‌ను 8.22 సెకన్లతో అగ్రస్థానంతో ముగించిన జ్యోతి ఫైనల్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అసుకా టెరెడా (జపాన్ – 8.21సె.), లుయి లై యు (హాంకాంగ్ – 8.21 సె.) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి భువనేశ్వర్‌లోని రిలయన్స్ ఫౌండేషన్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో శిక్షణ పొందుతోంది. ఈ చాంపియన్‌షిప్‌లో శనివారం మరో రెండు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల షాట్‌పుట్‌లో తజీందర్‌పాల్ సింగ్ తూర్ పసిడి గెలుచుకున్నాడు. తన రెండో ప్రయత్నంలో అతను గుండును 19.71 మీటర్లు విసిరి అగ్ర స్థానం సాధించాడు. మహిళల 1500 మీటర్ల పరుగులో హర్మిలన్ బైన్స్ కనకం మోగించింది. రేస్‌ను హర్మిలన్ 4 నిమిషాల 29.55 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం గెలుచుకుంది -
స్విమ్మింగ్ 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో కొత్త ప్రపంచ రికార్డు
ప్రపంచ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 4*100 మీటర్ల రిలే ఫైనల్లో చైనా స్విమ్మర్ పాన్ జాన్లె తన అంచెను 46.80 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ క్రమంలో డేవిడ్ పోపోవిచి (రొమేనియా; 46.86 సెకన్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును పాన్ జాన్లె బద్దలు కొట్టాడు. చైనా బృందం రిలే రేసును 3ని:11.08 సెకన్లలో ముగించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటలీ జట్టుకు రజతం, అమెరికా జట్టుకు కాంస్య పతకం లభించాయి. కెన్యా స్టార్ అథ్లెట్ దుర్మరణం.. ఆమె పరిస్థితి విషమం నైరోబి: కెన్యా స్టార్ అథ్లెట్, పురుషుల మారథాన్‌లో ప్రపంచ రికార్డు నెలకొలి్పన కెల్విన్ కిప్టమ్ కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కిప్టమ్ స్వయంగా నడుపుతున్న కారు అదుపుతప్పి పల్టీ కొడుతూ బలంగా చెట్టును ఢీకొంది. దుర్ఘటన సమయంలో కోచ్ హకిజిమానా, ఓ మహిళ కారులో ప్రయాణించగా... కిప్టమ్, కోచ్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాల పాలైన మహిళను హాస్పిటల్లో చేరి్పంచినట్లు పోలీసులు తెలిపారు. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉంది. 24 ఏళ్ల కిప్టమ్ త్వరలో జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించేందుకు శ్రమిస్తున్నాడు. అయితు, లక్ష్య చేరుకోకుండానే అతడు మృత్యువాతపడటం విషాదం. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన షికాగో మారథాన్ రేసులో (42.195 కిలోమీటర్లు; 2గం:00:35 సెకన్లు) కెల్విన్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఏప్రిల్‌లో జరిగిన లండన్ మారథాన్లోనూ కిప్టమ్ స్వర్ణ పతకం సాధించాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సీఎం రేవంత్‌పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
టుడేస్ లీడర్: రోజా హ్యాట్రిక్! వన్స్ మోర్ జగన్
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్‌కప్‌కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
తప్పక చదవండి
- సీఎం రేవంత్‌పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్‌పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement