-
‘హమాస్’ అత్యాచారాలు.. యూఎన్ సంచలన నివేదిక
జెరూసలెం: గతఏడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చేసిన దాడులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి(యూఎన్) సంచలన విషయాలు వెల్లడించింది. అక్టోబర్ 7 దాడిలో ఇజ్రాయెల్‌పై దాడి సమయంలో అక్కడి మహిళలపై అత్యాచారాలు జరిగాయనేందుకు కచ్చితమైన, ఆధారలతో కూడిన సమాచారం ఉందని యుద్ధంలో జరిగిన లైంగిక దాడులపై యూఎన్ నియమించిన ప్రమీల పాటెన్ బృందం తేల్చింది. హమాస్ బంధీలుగా తీసుకెళ్లిన ఇజ్రాయెల్ మహిళలపై ఇప్పటికీ అత్యాచారాలు జరుగుతున్నాయని యూఎన్ బృందం తన నివేదికలో తెలిపింది. ఫిబ్రవరిలో పాటెన్తో పాటు నిపుణుల బృందం ఇజ్రాయెల్, వెస్ట్‌బ్యాంక్‌లో పర్యటించారు. గాజా సరిహద్దులోని ఇజ్రాయెల్‌కు చెందిన మూడు ప్రాంతాలు నోవా మ్యూజిక్ ఫెస్టివల్ సైట్,రోడ్ 232, కిబుట్జ్ రెమ్లలో ఇజ్రాయెలీలపై రేప్‌లతో పాటు గ్యాంగ్ రేప్‌లు జరిగినట్లు రిపోర్టు వెల్లడించింది. చాలా వరకు కేసుల్లో ముందు రేప్ చేసి తర్వాత హత్య చేశారని తెలిపింది. చనిపోయిన మహిళల మృతదేహాలపైన కూడా రెండు చోట్ల అత్యాచారాలు జరిగినట్లు ఐక్యరాజ్యసమితి బృందం తేల్చింది. ఈ అత్యాచారాలపై సాక్ష్యం చెప్పాల్సిందిగా బృందం కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. అత్యాచార ఘటనలపై యూఎన్ బృందం సభ్యులు మొత్తం 5వేల ఫొటోలు, 50 గంటల సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు రేప్‌కు గురైన బాధితులతో మాట్లాడారు. హమాస్ వద్ద బంధీలుగా ఉండి విడుదలైన వారిని పలువురిని ఇంటర్వ్యూ చేశారు. కాగా, అక్టోబర్ 7న ఇజజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ మెరుపు దాడులు జరిపి వందల మంది ఇజ్రాయెల్ పౌరులను చంపి కొంత మందిని బంధీలుగా తమ వెంట తీసుకెళ్లింది. దీనికి ప్రతీకారంగా అప్పటి నుంచి ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై భీకర దాడులు చేస్తోంది. గాజాను మొత్తం చిధ్రం చేసింది. అమెరికా కోరినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. ఇదీ చదవండి..హైతీలో తీవ్ర అరాచకం -
HYD: తార్నాకలో గ్యాంగ్‌రేప్, ఆలస్యంగా వెలుగులోకి..
సాక్షి, హైదరాబాద్: తార్నాకలో ఘోరం జరిగింది. లిఫ్ట్ పేరిట ఒక మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు ఐదుగురు. నిందితుల అరెస్ట్‌తో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లాలాగూడ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి సమయంలో మహిళను తార్నాకలో వదిలిపెడతానంటూ మధు అనే వ్యక్తి నమ్మబలికాడు. తన స్కూటీపై ఎక్కించుకుని ప్రశాంత్‌నగర్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఫోన్ చేసి తన నలుగురు స్నేహితుల్ని రప్పించుకుని ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో మధు యాదవ్, బర్నా యేసు, సిరిగిరి ప్రశాంత్‌కుమార్, పస్తం తరుణ్‌కుమార్, కేశోజువా రోహిత్‌లపై కేసు నమోదు చేసుకున్నారు లాలాగూడ పోలీసులు. ప్రశాంత్.. మధుసూదన్.. రోహిత్ తరుణ్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఇన్నేళ్ళకు న్యాయం!
మూడు దశాబ్దాల పైచిలుకు క్రితం కేసులో బాధితులకు ఎట్టకేలకు కాసింత ఊరట దక్కింది. పోలీసుల దమనకాండకు ప్రతిరూపమైన తమిళనాడు వాచాత్తి ఘటనలో సెప్టెంబర్ 29న మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఆ రకంగా చిరకాలం గుర్తుండిపోతుంది. మారుమూల గ్రామంలోని గిరిజనులపై దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన కేసు అది. అటవీ, పోలీసు అధికారులతో సహా మొత్తం 269 మంది దోషులంటూ కింది కోర్టు ఏనాడో తీర్పు ఇచ్చింది. దోషులు పైకోర్టును ఆశ్రయించి, జాగు చేశారు. తాజాగా మద్రాస్ హైకోర్ట్ ఆ అప్పీళ్ళను కొట్టివేసింది. కింది కోర్ట్ తీర్పును హైకోర్ట్ సమర్థించడమే కాక, 215 మందినీ దోషులుగా తీర్మానిస్తూ, ఒక్కొక్కరికీ 1 నుంచి 10 ఏళ్ళ పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితులకు ఇన్నాళ్ళకైనా న్యాయం దక్కిందనే భావన కలుగుతోంది. ప్రజాస్వామ్యం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మిగులుతోంది. నిజానికి, తమిళనాట ధర్మపురి జిల్లాలో తూర్పు కనుమల్లో నెలకొన్న గిరిజన గ్రామం వాచాత్తి గురించి ముప్ఫయ్యేళ్ళ క్రితం ఎవరూ విననైనా విని ఉండరు. కేవలం 655 మంది, అందులోనూ 643 మంది మలయాళీ షెడ్యూల్డ్ తెగల వారున్న 200 గడపల గ్రామం అది. కానీ, ఆ రోజు జరిగిన ఆ దారుణ ఘటనతో ఒక్కసారిగా ఆ గ్రామం వార్తల్లో నిలిచింది. గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసులు, అటవీ అధికారులు గ్రామంపై దాడి చేశారు. అక్కడ గిరిజనులపై సాగించిన అమానుషం, బడికెళ్ళే ఓ చిన్నారి సహా 18 మంది మహిళలపై సామూహిక అత్యాచారం, తాగునీటిలో విషం కలిపిన తీరు, పశువుల్ని ఊచకోత కోసి ఊరి బావిలో పడేసిన వైనం... ఆ గ్రామం రూపురేఖల్నే మార్చేశాయి. ‘గంధపు చెక్కల స్మగ్లింగ్ గ్రామం’ అని ముద్రవేస్తూ అమాయకులపై అధికారులు సాగించిన ఆ దమనకాండ ఓ మాయని మచ్చ. కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లోతుగా విచారించి అధికారుల తప్పు తేల్చినా, ఏళ్ళ తరబడి వాయిదా పడుతూ వచ్చిన న్యాయం ఇన్నాళ్ళకు దక్కింది. బాధితులకు కాస్తయినా ఊరట దక్కింది. 1992 జూన్ 20 నుంచి మూడు రోజులు సాగిన అమానుష ఘటనలో మొత్తం 269 మంది నిందితులు కాగా, వారిలో 54 మంది న్యాయ విచారణ కాలంలోనే కన్నుమూశారు. మిగిలినవారికి ఇప్పుడు శిక్ష పడింది. ఈ కథ ఇక్కడి దాకా రావడం వెనుక న్యాయం కోసం సుదీర్ఘంగా సాగిన పోరాటం ఉంది. అప్పట్లో అధికారులపై కేసులు నమోదు కాకపోగా, గిరిజనులపైనే స్థానిక పోలీసులు ఎదురు కేసులు పెట్టిన పరిస్థితి. గిరిజనులు తమ ఇళ్ళను తామే ధ్వంసం చేసుకున్నారని అధికారులు బుకాయించారు. హైకోర్ట్ ఆదేశిస్తే గానీ చివరకు సీబీఐ దర్యాప్తు జరగలేదు. అంతరాయాలతో విచారణ సుదీర్ఘంగా 19 ఏళ్ళు సాగి, చివరకు 2011లో ధర్మపురి సెషన్స్ కోర్ట్ అధికారులను దోషులుగా తేల్చి, శిక్ష వేసింది. దోషులు మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించడంతో మరో 11 ఏళ్ళ సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ఈ కేసు విచారణ సత్వరమే పూర్తి చేయాలని హైకోర్ట్ న్యాయమూర్తి ఒకరు ఈ ఏడాది మొదట్లో పట్టుబట్టడంతో ఇప్పటికైనా కథ ఓ కొలిక్కి వచ్చింది. చిత్రం ఏమిటంటే – వాచాత్తి దమన కాండపై అప్పట్లోనే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైతే, ప్రభుత్వంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు అలాంటి నేరాలకు పాల్పడరంటూ జడ్జి దాన్ని కొట్టేయడం! జయలలిత సారథ్యంలోని అప్పటి అన్నాడీఎంకె పాలకులు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత అధికారంలో ఉన్న డీఎంకె, అన్నాడీఎంకె సర్కార్లూ తమ బ్యూరోక్రాట్లకు కాపు కాసేందుకే ప్రయత్నించాయి. కొందరు ఉద్యమకారులు, లాయర్లు, నిజాయతీపరులైన అధికారులు, జడ్జీల వల్ల చివరకు న్యాయం జరిగింది. అత్యాచార బాధితులు పట్టువిడవకుండా పోరాడడంతో ఇప్పటికైనా సత్యం గెలిచింది. కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత సాక్షిగా ధర్మం నిలిచింది. కేవలం 655 మంది ఆదివాసీలు బలమైన రాజ్యవ్యవస్థతో తలపడి, విజయం సాధించడం చరిత్రాత్మకం. ఆ రకంగా ఇది బలవంతులపై బలహీనుల గెలుపు. ఆదివాసీల హక్కుల గెలుపు. న్యాయవ్యవస్థ స్వతంత్రమనీ, పాలకుల తప్పులను సైతం సహించదనీ రుజువైంది. ఎస్సీ– ఎస్టీ చట్టం ఇప్పటికీ బలంగానే ఉందని తేలింది. అయితే, నేటికీ కొనసాగుతున్న అనేక దమనకాండ కేసుల్లో ఇంత సుదీర్ఘ పోరాటం, సత్యాన్ని వెలికితీసి దోషులకు శిక్షపడేలా బృహత్ యత్నం సాధ్యమేనా? న్యాయం దక్కడంలో ఆలస్యమైతే, న్యాయం చేయనట్టే! వాచాత్తి ఘటనలో అపరిమిత ఆలస్యమైంది. దోషుల్లో పలువురు బెయిల్‌పై బయట గడిపి, ఉద్యోగ ప్రయోజనాలన్నీ పొంది, హాయిగా రిటైరయ్యారు. ఇప్పటికైనా దోషులను శిక్షించడమే కాక, బాధితులకు తగిన న్యాయం చేయాలి. నష్టపరిహారాలిస్తే సరిపోదు. నలుగురిలో గౌరవంగా బతికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. వలసవాద బ్రిటీషు పాలన లక్షణాలను పోలీసులు, అధికారులు ఇప్పటికైనా వదిలించుకొంటే మేలు. తమిళనాట గిరిజనులపై అమానుషాల నుంచి మిజోరమ్‌లో గ్రామాల దహనం, కశ్మీర్లో నిర సనకారులపై కాల్పుల దాకా దశాబ్దాలుగా చూస్తున్నవే. బ్రిటీషు దౌర్జన్యానికి మన భారతీయ పోలీ సులు వారసులుగా మారిన వైనానికి ఇవి ప్రతీకలు. పదే పదే సాగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు సాక్ష్యాలు. అందుకే, ‘‘దాడుల పేరిట చట్టవ్యతిరేక చర్యలకు’’ పోలీసులు బరి తెగించడం దుస్సహమని కోర్ట్ అన్న మాట కీలకం. నిన్నటికి నిన్న కూడా వార్తల్లో కనిపిస్తున్న ఇళ్ళపై దుర్మార్గ దాడుల ధోరణిని వ్యవస్థ సత్వరమే వదిలించుకోవాలి. వాచాత్తి కేసు గుర్తుచేస్తున్న పాఠం అదే! -
వివాహితపై అత్యాచారం
కర్ణాటక: వివాహితపై సాముహిక అత్యాచారం చేసి, దానిని మొబైల్లో రికార్డు చేసి బ్లాక్‌మొయిల్ చేస్తున్న దారుణ ఘటనకు సంబంధించి బెళగావి పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గోకాక్ పట్టణంలో సెప్టెంబర్ 5న ఈ దుర్ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోకాక్ చుట్టు పక్కల ఒంటరి మహిళను గుర్తించిన ముఠా సభ్యులు ఆమైపె అత్యాచారం చేశారు. వీరు దోపిడీలకు కూడా పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇదే ప్రాంతంలో ఓ ఇంటిలో రూ. 10 లక్షల విలువైన నగలు దోచుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులకు అత్యాచారం ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి కేజీ బంగారు నగలు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. -
ఒంటి నిండా పంటి గాట్లతో రకప్తు మడుగులో..
క్రైమ్: మానవ మృగాల అకృత్యాలు రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. వావివరుసలు, వయసు తారతమ్యాలు లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. సామూహిక అత్యాచారానికి గురై.. అత్యంత దీనస్థితిలో ఓ మైనర్ బాలిక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సాత్నా జిల్లా మైహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగు చూసింది. అర్కండికి చెందిన 11 ఏళ్ల బాలిక బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని.. బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. అయితే శుక్రవారం ఉదయం మైహర్ శివారులోని అడవుల్లో శారదా దేవి ఆలయం సమీపంలో రక్తపు మడుగులో బాలిక కనిపించింది. నగ్నంగా పడి ఉన్న బాలికను గమనించిన కొందరు భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను మైహర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందని.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఒంటి నిండా పంటి గాయాలు ఉన్నాయని.. పదునైన ఆయుధాలతో ఆమె అంతర్గత అవయవాలనూ గాయపరిచారని వైద్యులు నివేదిక ఇచ్చారు. బాలిక పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటన స్థానికుల్లో ఆగ్రవేశాలను రగిల్చింది. ఆస్పత్రికి చేరుకుని ‘‘న్యాయం చేయాలనే’’ నినాదాలతో హోరెత్తించారు వాళ్లు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. వాళ్లను శాంతపరిచారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మైహర్ మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్ ఘటన రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్.. బీజేపీ సర్కార్ మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో విఫలమైందని విమర్శించగా.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అత్యున్నత స్థాయి విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement