-
‘నన్ను కించపరుస్తూ గెలవాలనుకుంటున్నారా?’: మంత్రి తానేటి వనిత
తూర్పుగోదావరి, సాక్షి: నల్లజర్లలో టీడీపీ శ్రేణులు తనపై దాడికి యత్నించడంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. దళితురాలినైన తనను కించపరుస్తూ.. రౌడీయిజంతో గెలవాలనుకోవడం ఎంత వరకు సబబని ప్రత్యర్థులను ఆమె నిలదీశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గోపాలపురం నియోజకవర్గంలో పర్యటించాం. ఎన్నికల ప్రచారం ముగించుకుని స్థానిక నేత సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నాం. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. మా నేతలపై రాళ్లతో దాడి చేయడంతో పాటు వాహనాలను సైతం ధ్వంసం చేశారు. వందమంది ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి ప్రచార రథంపై ఉన్న బాక్సులను, అక్కడున్న బైకులను ధ్వంసం చేశారు.హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. దళితురాలినైన నన్ను కించపరుస్తూ.. రౌడీయిజం ప్రదర్శిస్తూ, దాడి చేసి గెలవాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్?. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రచార కార్యక్రమంలో మేము ముందు ఉండటం.. మాకు ప్రజల ఆదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారు. గోపాలపురంలో వైఎస్సార్సీపీ గెలవబోతుందనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ కడుపు మంటతోనే దాడులకు తెగబడ్డారు.టీడీపీ శ్రేణుల దాడుల్లో.. మా కార్యకర్తలు నలుగురికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. ఒకరికి తల పగలటంతో కుట్లు సైతం పడ్డాయి. టీడీపీ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ.. దాడులు చేయిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కేసు దర్యాప్తు చేస్తున్నారు అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. -
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
-
CM Jagan : ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలా
సాక్షి, తూర్పుగోదావరి: సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంగా యాత్ర కొనసాగుతోంది. గోదావరి జిల్లాల్లో జన జాతరను తలపిస్తోంది. పల్లెల నుంచి పట్టణాల వరకూ తరలివచ్చిన జన సందోహంతో రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. నడినెత్తిన సూరీడు 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతతో నిప్పులు చెరుగుతున్నా లెక్క చేయకుండా మహిళలు, వృద్ధులు, చిన్నారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడాలని, ఆయనతో మాట కలపాలని రోడ్డుకు ఇరువైపులా బారులు తీరుతున్నారు. ఆయనకు అప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు. కాకినాడ జిల్లాలో జరుగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో దారిపొడవునా సీఎం వైఎస్ జగన్ కోసం జనం వేచి చూసి మరీ స్వాగతం పలికారు. సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ జరగనుంది దిక్కులు నాలుగే. కానీ ‘తూర్పు’ ఓ ప్రత్యేకత ఉంటుంది! ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేది ఈ దిక్కునే మరి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘తూర్పు’ గోదావరి స్పెషాలిటీ ఏంటన్నది.. మనమిప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు... ఈ జిల్లాపై పట్టు అధికారానికి మెట్టు అని చరిత్ర ఇప్పటికే చాలాసార్లు చెప్పింది! అలాంటి ‘తూర్పు’లో జగనన్న ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కొత్త చరిత్రను లిఖిస్తోంది బస్సు యాత్ర ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు! కాదూ కూడదు.. మాకు రుజువు కావాలంటున్నారా? చాలా సింపుల్... సీఎం జగన్ బస్సు యాత్రను దగ్గరగా ఫాలో కండి.. అభిమానంతో ఉప్పొంగిపోతున్న ప్రజలను చూడండి. ఇవ్వాళ రంగంపేటలో మొదలైన యాత్ర, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు చేరుకుంటుంది. ఇక్కడ కొద్దిసేపు భోజన విరామం. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్ , కత్తిపూడి బైపాస్ , తుని బైపాస్ , పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్లకు రాత్రి వరకు చేరుకుంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. సీఎంను కలవడానికి ప్రజలు పోటీ పడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సామర్లకోట వద్ద పెద్దాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ బస్సుయాత్రకు జనం ఆత్మీయ స్వాగతం పలికారు. సామర్లకోటలో మిట్టమధ్యాహ్నపు మండుటెండల్లోనూ అభిమానం ఏమాత్రం తగ్గలేదు. మేమంతా సిద్ధమంటూ ముఖ్యమంత్రి కోసం జనం బారులు తీరారు. పెద్దాపురం పాండవుల మెట్ట వద్ద 12:20గంటలకు బస్సు యాత్ర చేరుకుంది. స్థానికులకు అభివాదం చేసిన సీఎం జగన్.. కొద్దిసేపు వారిని కలిసారు. మధ్యాహ్నం 12.37గంటల నుంచి12.48 వరకు సామర్లకోట ఫ్లైఓవర్ పై బస్సు యాత్ర సాగింది. సామర్లకోట ఉన్డూరు క్రాస్ కు 12.48 గంటలకు చేరుకున్నారు సీఎం జగన్. సామర్లకోట అచ్చంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద మహిళలు కోరడంతో ముఖ్యమంత్రి జగన్ బస్సును కొద్దిసేపు నిలిపివేశారు. కిందికి దిగి మహిళలతో కొద్దిసేపు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. కాకినాడ జిల్లాలో కొందరు మహిళలు సీఎం జగన్ బస్సు యాత్రకు గుమ్మడికాయలతో దిష్టితీసి స్వాగతం పలికారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసుకోవాలని, క్షేమంగా ఉండాలని సీఎం జగన్ను దీవించారు. -
మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఉద్యమంలా కొసాగుతోంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ పర్యటిస్తున్న ప్రాంతమంతా జన కెరటాన్ని తలపిస్తోంది. అడుగడుగునా జనం ప్రభంజనం మాదిరి కదిలివస్తోంది. జై జగన్ అంటూ ఉవ్వెత్తున నినాదిస్తున్నారు. మేమంతా సిద్ధం 18వ రోజు శుక్రవారం (ఏప్రిల్ 19) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకు ఎస్టీ రాజపురం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
ఉమ్మడి ‘తూర్పు’లో అభివృద్ధి వికాసం
సాక్షి ప్రతినిధి, కాకినాడ:/సాక్షి, రాజమహేంద్రవరం/అమలాపురం: తూర్పు గోదావరికి రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకతే వేరు. గడచిన ఐదేళ్ల ప్రగతితో ఆ జిల్లా స్వరూపమే మారిపోయింది. పట్టణాలతో పోటీపడేలా పల్లెల్లో సైతం పారిశ్రామికీకరణకు పునాదులు పడ్డాయి. రూ.299.40 కోట్లతో రోడ్లు, భవన నిర్మాణాలు చేపట్టారు. రూ.229.40తో పనులు మొదలయ్యాయి. మరో 33 రోడ్లను రూ.42.87 కోట్లతో మరమ్మతులు చేశారు. రెండో దశలో రూ.26.37 కోట్లతో పనులు చేపట్టారు. కత్తిపూడి–ఒంగోలు జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వశిష్ఠ నదిపై వంతెన నిర్మాణానికి రూ.580.42 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కోనసీమ రైల్వే లైన్ కల సాకారమవుతోంది. దీనికోసం ఈ ఏడాది రూ.300 కోట్లు నిధులు వచ్చాయి. అయినవిల్లి మండలంలో రూ.300 కోట్లతో 440/132 కేవీ మెగా విద్యుత్ స్టేషన్ పనులు జరుగుతున్నాయి. పి.గన్నవరం మండలం ఉడిమూడిలంక, గంటి పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక ప్రజలు గోదావరిపాయ దాటాల్సిన అవసరం లేకుండా రూ.49.50 కోట్లతో వంతెన పనులు మొదలయ్యాయి. ముమ్మిడివరం– ఐ.పోలవరం సరిహద్దులో వృద్ధ గౌతమీ, గౌతమీ నదీ పాయల మధ్య పశువుల్లంక మొండి రేవు వద్ద రూ.49 కోట్లతో వంతెనను సీఎం జగన్న్పూర్తి చేయడంతో 16 గ్రామాల్లోని 8 వేల మందికి సౌకర్యం కలిగింది. 2023, 2024 సంవత్సరాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో రికార్డు స్థాయిలో దిగుబడి సాధించారు. గతేడాది ఎకరాకు 32 బస్తాలు దిగుబడి వస్తే ఈ ఏడాది 38 నుంచి 45 బస్తాలు పండించారు. ఏటా ఖరీఫ్ సీజ¯న్లో 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రాజమహేంద్రి రాత మారింది ♦ రూ.423 కోట్లతో నాలుగున్నరేళ్లలో నగర రూపురేఖలు మారిపోయాయి. ♦ నవరత్నాలుతో జిల్లా వ్యాప్తంగా 33 పథకాలతో ప్రజలకు మేలు జరిగింది. రికార్డు స్థాయిలో రూ.25,436 కోట్లు వెచ్చించారు. ♦ నాడు–నేడులో 1069 పాఠశాలల భవనాలకు రూ.369.89 కోట్లు వెచ్చించారు. ♦ గృహాల కోసం 68,518 మందికి రూ.1233.34 కోట్లు వెచ్చించారు. 336 గ్రామ సచివాలయాలకు రూ.108.47 కోట్లు విడుదలయ్యాయి. ♦ డిసెంబర్ నాటికి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు రూ.25,436 కోట్లు వెచ్చించింది. ♦ రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో ఏర్పాటైన మెడికల్ కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ♦ 1.46 లక్షల మంది ఇంటి పట్టాలు అందుకున్నారు. తొలి దశలో రూ.113.48 కోట్లతో 63,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ♦ అనపర్తి బలభద్రపురంలో రూ.2500 కోట్లతో గ్రాసిమ్ కాస్టిక్ సోడా పరిశ్రమతో 2500 మందికి ఉపాధి లభించింది. ♦ గోకవరం మండలం గుమళ్లదొడ్డి వద్ద రూ.260 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. 210 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ♦ కొవ్వూరు మండలం ఇసుకపట్ల పంగిడి వద్ద రూ.1,350 కోట్లతో త్రివేణి రెన్యువబుల్స్ ఆధ్వర్యంలో సోలార్ గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటైంది. దీని ద్వారా 2400 మందికి ఉద్యోగాలు దక్కాయి. ♦ నల్లజర్ల మండలం పోతవరంలో రూ.50 కోట్లతో జాగృతి బయోటెక్ ప్రైవేటు సంస్థ బయోటెక్నాలజీ కంపెనీ అందుబాటులోకి రానుంది. ♦ ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నాడు–నేడులో రూ.9.21 కోట్లు మంజూరు ♦ గడప గడపకు మన ప్రభుత్వంలో ఎదురైన సమస్యల్లో రూ.72.88 కోట్ల నిధులతో 1,102 పనులకు పరిష్కారం. ♦‘నాడు– నేడు’ మొదటి విడతలో రూ.104.96 కోట్లతో 436 పాఠశాలలు, రెండో విడతలో రూ.257 కోట్లతో 761 పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధి. ♦ పేదలందరికీ ఇళ్లు రెండు విడతల్లో 34,454 ఇళ్లకు రూ.62,017 కోట్లు కేటాయింపు. ♦ జల జీవన్ మిషన్లో రూ.515.93 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్లైన్ల నిర్మాణం. ♦ జగనన్న కాలనీల్లో 209 లే అవుట్లలో కుళాయిల కోసం రూ.45.75 కోట్లు కేటాయింపు. ♦ ఇంటింటికీ గోదావరి జలాలందించేందుకు రూ.1,650 కోట్లు కేటాయింపు ఫుడ్ ప్రాసెసింగ్, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు, హేచరీల్లో కల్పిస్తున్న ఉపాధి ఇలా 2019– 20లో 265 యూనిట్లతో 1707 మందికి 2020–21లో 119 యూనిట్లతో 978 మందికి 2021–22లో 720 యూనిట్లతో 4254 మందికి 2022–23లో 2412 యూనిట్లతో 9455 మందికి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement