-
బంజారాహిల్స్ పబ్‌లో అసభ్య డ్యాన్స్‌లు.. 35 యువతుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలోని ఆఫ్టర్ 9 పబ్‌పై శనివారం రాత్రి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. కస్టమర్లను ఆకర్షించడానికి నిర్వాహకులు వేరే రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి పబ్‌లో అసభ్యకర డ్యాన్స్‌లు చేపిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు చేపట్టారు. అర్థరాత్రి మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పబ్‌ను క్లోజ్ చేయించి.. కేసు నమోదు చేశారు.కాగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పటికీ అర్ధరాత్రి వరకు బార్ & పబ్ ఆర్గనైజర్ నిర్వహిస్తున్నారు. After 9 పబ్ రైడ్ సమయంలో సుమారు 100 నుండి 150 మంది యువతి యువకులు ఉన్నట్లు సమాచారం. మద్యం మత్తులో డ్యాన్స్ 32 మంది యువతులు, 75 యువకులు అదుపులోకి తీసుకున్నారు. 32 మంది యువతులను పోలీస్ వాహనంలో సైదాబాద్‌లోని రెస్క్యూ హోమ్ తరలించారు. వీరు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు. -
Banjarahills: బంజారాహిల్స్‌లో బెంజ్ కారు బీభత్సం...
హైదరాబాద్: అదుపు తప్పిన వేగంతో వచ్చిన బెంజ్ కారు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. అమెరికాలో నివసించే అయిదుగురు యువతీ యువకులు ఓ వివాహానికి హాజరయ్యేందుకు నాలుగు రోజుల క్రితం నగరానికి వచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్–45లో నివసించే వెంకటష్, అవినాష్‌తో పాటు జర్మనీ, అమెరికాలో నివసించే మ్యాక్స్మిలన్ హెన్రీ, ప్రీతమ్, ఓ యువతి బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో బస చేశారు.మంగళవారం రాత్రి వీరు బెంజ్ కారులో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్–45లోని దస్పల్లా హోటల్ పైన ఉన్న కారా పబ్‌కు వెళ్లారు. మద్యం తాగిన అనంతరం అర్ధరాత్రి కారులో మాదాపూర్,గచ్చిబౌలి, దుర్గంచెరువు ప్రాంతాలను చుట్టేసి పార్క్ హయత్ హోటల్ వైపు వెళ్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10/36 శ్రీజ్యువెలర్స్ వద్ద వీరు వెళ్తున్న కారు అదుపుతప్పి అంతే వేగంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పైకి దూసుకెళ్లింది. కాగా.. ఇందులోని అయిదుగురు యువతీ యువకులు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్టేషన్‌కు తరలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా కారు నడుపుతున్న వెంకటేష్ 44 ఎంజీ, అవినాష్ 173 ఎంజీతో పాటు మిగతావారు కూడా మద్యం తాగినట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్‌కు చెందిన చలసాని మాధవీదేవి పేరుతో కారు రిజిస్టరై ఉందని పోలీసులు గుర్తించారు. ఓ పెళ్లికి హాజరుకావడానికి వీరంతా నగరానికి వచ్చినట్లు తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు కారును సీజ్ చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
Sowmya Janu Photos: రంజాన్ విందు ఇచ్చిన నటి సౌమ్యజాను (ఫొటోలు)
-
వారం రోజుల్లో పరీక్షలు.. అంతలోనే దుర్మరణం
బంజారాహిల్స్: వారంరోజుల్లో పదోతరగతి పరీక్షలు.. ఈలోగా స్నేహితులతో సరదాగా గడుపుదామనుకున్నాడు.. అంతలోనే ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బోరబండకు చెందిన ఆటోడ్రైవర్ జగదీశ్ కుమారుడు భరణిసాయి లోకేష్(15) అదే ప్రాంతంలోని ఎస్వీఎస్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా ఆదివారం ఉదయం నలుగురి స్నేహితులతో కలిసి బైక్‌లపై బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కుకు బయలుదేరారు. శ్రీనగర్‌కాలనీ టీవీ9 జంక్షన్లో సాయిలోకేశ్ బైక్‌ను టర్న్ చేసే క్రమంలో అదుపుతప్పింది. దీంతో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి ఎగిరి స్ట్రీట్‌లైట్ స్తంభానికి తగలడంతో సాయిలోకేశ్ తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు. పక్కనే బైక్‌లు నడుపుతున్న స్నేహితులు ఒక్కసారిగా వచి్చన పెద్ద శబ్దం విని షాక్‌కు గురయ్యారు. రెప్పపాటులో రక్తపుమడుగులో ఉన్న స్నేహితుడిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఒక్కగానొక్క కొడుకు కళ్లముందే విగతజీవిగా మారడంతో జగదీశ్‌తోపాటు కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. శనివారం రాత్రే కొడుకును తీసుకెళ్లి రహమత్‌నగర్‌లో పరీక్షాకేంద్రాన్ని చూసి వచ్చానని, ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుందని తండ్రి బోరున విలపించాడు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనాస్థలంలో సీసీ ఫుటేజీలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్ ధరించి ఉంటే ఆ బాలుడు బతికి ఉండేవాడని పోలీసులు వెల్లడించారు. -
Banjara Hills: ట్రాఫిక్ బూత్‌లో మృతదేహం
హైదరాబాద్: రోడ్డు నంబర్–1లోని తాజ్‌కృష్ణా హోటల్ చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్ బూత్ అంబ్రిల్లాలో అనుమానాస్పద మృతదేహాన్ని బంజారాహిల్స్ పోలీసులు స్వాదీనం చేసుకుని ఉస్మానియాకు తరలించారు. తాజ్‌కృష్ణా చౌరస్తాలోని ట్రాఫిక్ బూత్‌లో గుర్తుతెలియని మృతదేహం(32) ఉన్నట్టు మంగళవారం ఉదయం విధుల్లోకి వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని బంజారాహిల్స్ సీఐ రాఘవేందర్ తెలిపారు. ఆరా తీయగా ఫుట్‌పాత్‌లపై పడుకునే నిరాశ్రయుడిగా తేలిందని ఆయన చెప్పారు. తలకు వెనకాల గాయమైందని.. రోడ్డు దాటుతున్నప్పుడు ఏదైనా వాహనం ఢీకొట్టిందా? లేక ప్రమాదవశాత్తూ కిందపడ్డాడా? అనే విషయాలు తెలియాల్సి ఉందన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement