-
చంద్రబాబు మరో కుట్ర.. వారందరికీ నిలిచిపోయిన నిధులు!
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు పలు కుట్రలకు పాల్పడుతున్నాడు. తాజాగా చంద్రబాబు మరో కుట్రకు తెరలేపారు. పేదలకు ప్రభుత్వాలు పథకాలు అందకుండా అడ్డుపడ్డాడు.కాగా, రాష్ట్రంలో ఇప్పటికే వలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు అండ్ కో.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో, పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు అవస్థలు పడుతున్నారు. వేసవి మండుటెండలో పెన్షన్‌దారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.ఇక, తాజాగా వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, విద్యాదీవెన, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ నిధులను ఇవ్వకుండా చంద్రబాబు అడ్డు తగిలాడు. అయితే, ఈ పథకాలన్నీ గత ఐదేళ్లుగా అమలవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయినా సరే టీడీపీ ఫిర్యాదు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈసీ నిధులను విడుదల కానివ్వలేదు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. అయినప్పటికీ చంద్రబాబు ఫిర్యాదు కారణంగా నిధులు విడుదల కాలేదు. దీంతో, డీబీటీ చివరి దశ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, ఈసీ అనుమతి కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
‘ముందు రాయ్‌బరేలీ నుంచి గెలవండి’
లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ కంచుకోట స్థానాలైన రాయ్‌బరేలీ, అమేథీ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఆ పార్టీ తమ అభ్యర్థులు ప్రకటించింది. రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అమేథీలో కిషోర్ లాల్ శర్మను బరిలోకి దించింది. రాహుల్ గాంధీ తాను మూడు సార్లు గెలిచిన అమెథీని వదిలి బాయ్బరేలీ బరిలో దిగటంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. బీజేపీ నేతలే కాకుండా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ సైతం రాహుల్‌గాంధీపై విమర్శలు చేశాడు. ‘గ్యారీ కాస్పరోవ్, విశ్వనాథ్ ఆనంద్ వంటి చెస్ ఆటగాళ్లు.. త్వరగా రిటైర్ అవటం మంచిదైంది. వారు.. ఒక చెస్ మెథావిని ఎదుర్కొవల్సిన అవసరం లేదు’ అని ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌కు.. ‘అగ్రస్థానం కోసం సవాల్ చేసే ముందు ముందు రాయ్‌బరేలీ నుంచి గెలివాలి’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి గ్యారీ కాస్పరోవ్ సెటైర్ వేశారు.Traditional dictates that you should first win from Raebareli before challenging for the top! 😂— Garry Kasparov (@Kasparov63) May 3, 2024మరోవైపు.. నటుడు రన్వీర్ షోరే స్పందిస్తూ.. ఈ పరిణామాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారని రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియోతో గ్యారీ కాస్పరోవ్‌ను ట్యాగ్ చేశారు. ‘భారత రాజకీయాల్లో నా చిన్న జోక్ ప్రభావితం చేయదని ఆశిస్తున్నా. అయితే నాకు నచ్చిన చెస్ ఆటలో మాత్రం రాజకీయ నాయకుడు (రాహల్ గాంధీ) ఆడటం చూడకుండా ఉండలేను!’ అని గ్యారీ కాస్పరోవ్ అన్నారు.Nice one, @Kasparov63, but can you handle this move? https://t.co/xrWFf3zLK9 pic.twitter.com/quuw4JGB43— Ranvir Shorey (@RanvirShorey) May 3, 2024రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో పోటీ చేయటంపై కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ వివరణ ఇచ్చారు. ‘రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయటంపై చాలా మందికి పలు అభిప్రాయాలు ఉంటాయి. అయితే అందరూ.. రాహుల్ గాంధీకి రాజకియాలతో పాటు చెస్ ఆట మీద చాలా పట్టుందని మర్చిపోవద్దు’ అని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. దీంతో ఆయన ట్వీట్‌పై బీజేపీ నేతలు, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.Many people have many opinions on the news of @RahulGandhi contesting elections from Rae Bareli.Remember, he is an experienced player of politics and chess. The party leadership takes its decisions after much discussion, and as part of a larger strategy. This single decision…— Jairam Ramesh (@Jairam_Ramesh) May 3, 2024చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను రష్యా ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. పుతిన్ ప్రభుత్వంపై ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించడమే దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వ విధానాలను కాస్పరోవ్ వ్యతిరేకించడం వల్లే అధికారులు ఆయన్ను ఉగ్రవాదులు, తీవ్రవాదులు జాబితాలోకి చేర్చారు. చెస్‌లో పలుమార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన 60 ఏళ్ల గ్యారీ కాస్పరోవ్ చాలా కాలంగా పుతిన్ ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. -
ఢిల్లీలో తొలి ట్రాన్స్‌జెండర్ నామినేషన్
న్యూఢిల్లీ, సాక్షి: దేశ రాజధానిలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఢిల్లీలో తొలి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్ వేశారు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గానికి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.ధోతీ, తలపై టోపీ, బంగారు ఆభరణాలు ధరించి సాకేత్‌లోని దక్షిణ ఢిల్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న 26 ఏళ్ల రాజన్ సింగ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. థర్డ్ జెండర్ వ్యక్తుల హక్కులతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలతోపాటు అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజన్ సింగ్ తెలిపారు.బిహార్‌కు చెందిన రాజన్ సింగ్ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు తన నామినేషన్ థర్డ్ జెండర్ ఉనికిని, హక్కులను తెలియజేసే ప్రయత్నం అని రాజన్ సింగ్ అన్నారు. దేశంలో జంతువులకు కూడా సంక్షేమ బోర్డులు ఉన్నాయి కానీ థర్డ్ జెండర్ వ్యక్తుల పరిస్థితి వాటి కన్నా హీనంగా ఉందని వాపోయారు. తాను గెలిస్తే, థర్డ్ జెండర్ ప్రాథమిక అవసరాలను పరిష్కరిస్తానని రాజన్ సింగ్ చెప్పారు. -
Malkajgiri Lok Sabha: మల్కాజిగిరి మాదే...
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్టింగ్ స్థానం.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్ .. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం.. ఇలా విభిన్నమైన రాజకీయ సమీకరణాలతో అందరి దృష్టి ఆకర్షిస్తోంది మల్కాజిగిరిలోక్ సభ నియోజకవర్గం. ఎంతో మంది రాజకీయ నాయకుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన చోట జిల్లాపరిషత్ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన పట్నం సునీతా మహేందర్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.. సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్ స్థానం నుంచి పోటీచేయడానికి అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. మరో మారు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సీఎం చాలెంజ్‌గా తీసుకున్నారు. గతంలో ఆయన విజయానికి పనిచేసిన నేతలు, కేడర్ అంతా కలిసికట్టుగా ఏకతాటిపై పనిచేస్తున్నారు. తెలంగాణ సమాజం రేవంత్‌రెడ్డిని గట్టిగా నమ్ముతోంది. సానుకూల వాతావరణం ఉంది.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదేళ్ల పాటు జిల్లాపరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశాను. ప్రతి మండలం, గ్రామ స్థాయిలో పారీ్టలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలల అభివృద్ధికి నిధులు అందించాను. ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు, నాయకులు బ్రహ్మరథం పడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా పారీ్టలో చేరుతున్నారు. తోటి మహిళను గెలిపించుకుంటామని మహిళలంతా స్వతహాగా ముందుకొస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉంది. మహేశ్వరం, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నివాస గృహాలు మునిగిపోతున్నాయి. తక్షణం వరద సమస్య పరిష్కరించడానికి సీఎం సానుకూలంగా ఉన్నారు. ఉప్పల్, మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాలో ట్రాఫిక్, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మూసీ పరివాహక ప్రాంతంలో శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో తయారు చేశాం. ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం.. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య చీకటి ఒప్పందం నడుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి రాజేందర్ మ«ధ్య జరిగిన సంభాషణే ఇందుకు సాక్ష్యం. బయట ఎన్ని మాటలు మాట్లాడినా లోలోపల వాళ్లంతా ఒక్కటే. ఎన్నికల సమయంలో పరస్పర అవగాహనతోనే ముందుకెళుతున్నారు.మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మరు.. ఎన్నికలు అనగానే రాజకీయ పారీ్టలు రకాల హామీలతో ప్రజల ముందుకొస్తారు. గతంలో ఈ ప్రాంతంలో వరదలు వచ్చినపుడు అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండిపోతే బండి ఇస్తామన్నారు. ఒక్కరినీ ఆదుకున్న పాపాన పోలేదు. ఇలాంటివి ఎన్నో హామీలు గాలికి వదిలేశారు. అందుకే ఈ సారి బీజేపీని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఈటల రాజేందర్ ఇక్కడి ప్రజలకు కొత్త. స్థానిక సమస్యలపై ఆయనకు అవగాహన లేదు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయింది. అందుకే ఆ పార్టీ తరపున పోటీ చేయడానికే ఎవరూ ముందుకు రాలేదు.ఉప్పల్, ఎల్బీ నగర్లో ఐటీ అభివృద్ధి చేస్తాం. ఉప్పల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జేఈఈ, నీట్, క్యాట్ శిక్షణ తగతులు ఏర్పాటు చేస్తాం. మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేందుకు పై వంతెనలు (ఫ్లై ఓవర్ బ్రిడ్జ్) నిర్మాణం, అంతర్గత రహదారులు, కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తాం. -
'పవర్'లెస్.. భ'జనసేన' మాకొద్దు!!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తాను ఎదగాలని ఏ రోజూ కోరుకోలేదని మొన్న కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇంద్రపాలెం, సామర్లకోట సభల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా వల్లె వేశారు. తాను కులాలకు అతీతమంటూనే కాపులకు ప్రాధాన్యమేదని ప్రశ్నిస్తారు. రాష్ట్రమంతా జల్లెడ పట్టి ఆ సామాజిక ఓటర్లు అధికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇతర కులాల పట్ల విద్వేష పూరితంగా మాట్లాడతారు. గతంలో టీడీపీని పలుమార్లు తూర్పారబట్టిన పవన్.. ఇప్పుడు అదే పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ తన ఫ్యాన్స్ నుంచే ప్యాకేజీ స్టార్‌గా గుర్తింపు పొందారు. బీజేపీని తీవ్రంగా నిందించిన ఆ నోటితోనే అత్యద్భుతమని పొగుడుతారు. మాటలో నిజాయితీ, వ్యవహారంలో స్థిత ప్రజ్ఞత, మనిíÙలో స్థిరత్వం మచ్చుకైనా కనిపించని పవన్ నాయకత్వంలోని భ‘జనసేన’లో ఇక కొనసాగలేమని పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు.నేను ప్రశ్నిస్తాను.. నిలదీస్తాను.. ఎదిరిస్తాను.. అంతు తేలుస్తాను.. ప్రజల పక్షాన నిలుస్తాను... అంటూ నిత్యం ఊగిపోతూ డాంబికాలు పలికే జనసేనాని పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ నాయకులు, క్యాడర్ ప్రశ్నలకు కనీస స్థాయిలో సమాధానం చెప్పుకునే స్థితిలో లేరనే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతల నుంచి తమకు ఎదురవుతున్న తీవ్ర అవమానాలు, అసహనాలు, ఈసడింపులు, ఛీత్కారాలను తట్టుకోలేకపోతున్నామని జన సైనికులు ఆవేదన చెందుతున్నారు.జనసేనాని తీరుతోనూ వరుసగా పార్టీని వీడిపోయే వారే తప్ప కొత్తగా వచ్చి చేరేవారు మచ్చుకు ఒక్కరూ కనిపించడం లేదంటున్నారు. జనసేన ఆవిర్భావ సమయంలో ఏదో సాధించేస్తారనే అంచనాలతో పవన్ పక్కన చేరిన మేధావులు, మాజీ ఉన్నతాధికారులు, సీనియర్ నాయకులకు ఆయన తత్వం త్వరగానే బోధపడి తమ దారి చూసుకున్నారు.రాజకీయాలపై ఆసక్తితో, ఏదో ఒకటి చేయకపోతారా, పార్టీని ముందుకు తీసుకెళ్లకపోతారా, మంచి రోజులు రాకపోతాయా? అనే ఆశతో ఇటీవలి వరకు కొనసాగిన వారికి మాత్రం తమ దింపుడు కల్లం ఆశలు ఆవిరై జనసేనకు జెల్లకొట్టి ఇతర పార్టీల్లోకి చేరిపోతున్నారు. కొందరేమో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేంటన్న భావనతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ తాజా పరిస్థితులను గమనిస్తున్నారు. ఇంకొందరు పదవులపై ఆశలు వదులుకుని రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.కూటమిలో సీట్ల సర్దు‘పాట్ల’ను చూసిన తర్వాత దాదాపు రోజూ జనసేనలో రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి హోదా కలిగిన నాయకులు ‘పవన్.. నీకో నమస్కారం..’ అంటూ గుడ్ బై చెబుతూనే ఉన్నారు. చివరకు తోక పార్టీగా మారి సైకిల్ వెనుక తిరిగేలా, టీడీపీకి సేవ చేసుకునే ‘సేన’లా జనసేనాని చేసేశారని, కనీస గౌరవ మర్యాదలూ దక్కడం లేదని జనసేన శ్రేణులు మధన పడుతున్నాయని ఆ పార్టీని వీడిన వారు వివరిస్తున్నారు. ప్రతి అడుగులోనూ తొట్రుపాటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తామనే అంచనాలతో కొణిదెల చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూశారు. కాలక్రమంలో జెండా ఎత్తేసి కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పదవిని అనుభవించారు. అన్నకు తోడుగా ప్రజారాజ్యంలో యువరాజ్యం చీఫ్‌గా చలామణీ అయిన పవన్ కళ్యాణ్.. 2014 ఎన్నికలకు ముందు ‘జనసేన’ను స్థాపించినప్పటికీ ప్రతి అడుగులోనూ తొట్రుపాటే కనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల మాట.పార్టీ ఆవిర్భావంలో టీడీపీ, బీజేపీలతో జత కట్టిన పవన్, ఏ ఎండకా గొడుగు అన్నట్లు ఎక్కడి మాటలు అక్కడ మాట్లాడుతూ తన అవసరాలు కానిచ్చేసుకుంటూ వచ్చారు. 2019 నాటికి టీడీపీకి మేలు చేసేలా ‘రహస్య ఒప్పందాలు’తో తన జనసేనే ప్రత్యామ్నాయమనే రీతిలో ఎన్నికల బరిలోకి దిగి.. గాజువాక, భీమవరంలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీలతో కూటమి కట్టిన పవన్.. చంద్రబాబు కోసం నానా ప్రయాసలకు లోనవుతూ తన నటనానుభవాన్ని రంగరించారు.చివరకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు అంగీకరించి ప్రత్యక్ష రాజకీయాల్లో తలపడాలనుకున్న అనేక మంది ఆశావహులపై నీళ్లు చల్లారు. పిఠాపురం నుంచి స్థానికేతరుడిగా బరిలో నిలిచి .. స్థానికురాలు, విద్యావంతురాలు, సీనియర్ రాజకీయవేత్త అయిన వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతతో పోటీ పడటానికి కిందామీదా పడుతున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మేధావి వర్గం ముందే మేల్కొని.. తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పని చేసిన ఆర్.ఆర్.రామ్మోహన్రావు, సీబీఐ మాజీ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి జె.డి.లక్ష్మీనారాయణ, ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, మాదాసు గంగాధరం, ముత్తంశెట్టి కృష్ణారావు, రాఘవయ్య, బైరా దిలీప్, ఆకుల చంద్రశేఖర్ లాంటి వారెందరో పవన్ రాజకీయ పరిజ్ఞానాన్ని, వ్యవహార శైలిని పసిగట్టి పక్కకు తప్పుకున్నారు.రాజకీయాలపై ఆశలున్న వారు పలువురు పార్టీలోకి అడుగిడి రూ.కోట్లు, లక్షలు పోగొట్టుకున్న తర్వాత మేల్కొని దూరమయ్యారు. తాము ఏ విధంగా మోసపోయిందీ ఏకరువు పెట్టారు కూడా. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పవన్ ఓడిపోయినా, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. çపలు నియోజకవర్గాల్లో గౌరవప్రదమైన ఓట్లను పొందిన జనసేన అభ్యర్థులకు తాజా ఎన్నికల్లో కూటమి తరఫున సీట్లు సాధించుకోవడంలోనూ పవన్ పూర్తిగా విఫలమయ్యారు.విజయవాడ వెస్ట్‌లో బీసీ వర్గానికి చెందిన పోతిన మహేష్ ఉమ్మడి కృష్ణాలో బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, గుంటూరు జిల్లాలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, చిల్లపల్లి శ్రీనివాసరావు, అప్పారావు, నేరెళ్ల సురేష్ దర్శికి చెందిన ఎన్ఆర్ఐ వెంకట్, తూర్పుగోదావరికి చెందిన తుమ్మల బాబు, శెట్టిబత్తుల రాజబాబు, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, పాతంశెట్టి సూర్యచంద్ర తదితరులు జనసేన బాధిత వర్గంగా మిగిలిపోయారు. అవనిగడ్డ సీటు ఆశించిన వారిదీ అధోగతేనని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.కొన్ని జిల్లాలకే పరిమితం..రాష్ట్ర స్థాయి పార్టీగా ఆవిర్భవించిన జనసేనను పవన్ కళ్యాణ్ తన అపరిపక్వతతో అతి తక్కువ సీట్లతో కొన్ని జిల్లాలకే పరిమితం చేశారని పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. ఆ సీట్లు కూడా చాలా మంది టీడీపీ నేతలకే ఇచ్చారు. జనసేన ఆవిర్భవించి దశాబ్ద కాలమైనా సంస్థాగతంగా కనీస స్థాయిలో బలపడలేదు. చివరకు పార్టీ గుర్తునూ సక్రమంగా దక్కించుకోలేని స్థితిలోకి జనసేన దిగజారింది. ‘జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మాటలను, ఆయన బంధం వ్యవహారాలను అంచనా వేసుకోలేక అమెరికా నుంచి కుటుంబం మొత్తం వచ్చి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయాం.కోట్ల రూపాయలు పోగొట్టుకుని నష్టపోయాం. సీటు ఇస్తామంటూ మోసం చేశారు’ అని దళిత మహిళ సి.సుభాషిణి ఆవేదనలో జనసేన చేతిలో దెబ్బతిన్న వారందరి గుండె ఘోష వినిపిస్తోంది. జనసేన నాయకులు, కార్యకర్తలు తమ వెంట నడవడానికి, వేదికను పంచుకోవడానికి కూడా పలువురు టీడీపీ నాయకులు అంగీకరించడం లేదంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదని జనసేన నేతలు వాపోతున్నారు. పవర్ లెస్!పిఠాపురంలో పని చేయని పవన్ మానియా అందుకే మెగా ఫ్యామిలీని దింపుతున్నారని చర్చ పలువురు బుల్లితెర నటులు సైతం ప్రచారం ఇంత మంది వస్తే గానీ నెగ్గలేనని అనుమానం! తానొక్కడిని గెలిస్తే చాలనుకుంటున్న వైనంజనసేన అభ్యర్థుల గెలుపుసంగతేమోగానీ, పిఠాపురంలో తాను గెలిస్తే చాలనే స్థితికి వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నాయకుడిగా తాను నిలబెట్టిన వారి గెలుపు సంగతి పక్కనబెట్టి, అధిక సమయం తన కోసమే కేటాయించుకున్నారని ఆ పార్టీ నేతల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తానొక్కడే గెలిచి అసెంబ్లీకి వెళితే చాలన్నట్టుగా ఉంది ఆయన శైలి అని జనసేన శ్రేణులు వాపోతున్నాయి.పవన్ అన్న నాగబాబు నెల రోజులుగా పిఠాపురంలోనే తిష్ట వేశారు. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ ఇప్పటికే ఇక్కడ ప్రచారం చేశారు. నాగబాబు భార్య సైతం మరిది కోసం ప్రచారంలో పాలు పంచుకున్నారు. పవన్ మేనల్లుడు వైష్ణవ తేజ్ కూడా పిఠాపురంలో తిరగాల్సిన పరిస్థితి. వీరికితోడు జబర్దస్త్ టీం మొత్తం ఇక్కడ వాలిపోయింది. అయినప్పటికీ పిఠాపురంలో ప్రచారం సరిపోదనుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందువల్లే మెగాస్టార్ చిరంజీవిని పిఠాపురంలో ప్రచారానికి రప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.పదుల సంఖ్యలో తారలు దిగి వస్తున్న తీరు చూస్తుంటే పిఠాపురంలో తన గెలుపుపై పవన్‌కు నమ్మకం లేదనేది స్పష్టమవుతోందంటున్నారు. ప్రచార ఆర్భాటం, మద్యం, డబ్బు లేని ఎన్నికలు రావాలని తెగ గొప్పలు చెప్పిన పవన్.. ఇప్పుడు రూ.కోట్లు వెదజల్లడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దఫా ఎమ్మెల్యే కాకపోతే ఇక తన రాజకీయ జీవితం ముగిసినట్టే అని అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాలనే నిర్ణయానికి వచి్చనట్టు చెబుతున్నారు. ఇందులో మెగా హీరోలు, జబర్దస్త్ ఆరి్టస్టుల స్పెషల్ ఫ్లైట్ చార్జీలు, ఇతర ఏర్పాట్లకు అవుతున్న ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయంటున్నారు.ఒక పాన్ ఇండియా సినిమా బడ్జెట్ అంత ఖర్చుకు సిద్ధమయ్యారని ఇక్కడి ఏర్పాట్లు చూస్తుంటే ఇట్టే అర్థమవుతోంది. ఇంత ఖర్చు పెడుతున్నా అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను ఎదుర్కోవడం కష్టంగా ఉందని జనసేన నేతలు ఒప్పుకుంటున్నారు. కాగా, పిఠాపురంలో చక్రం తిప్పుతున్నానని చెప్పుకుంటున్న టీడీపీ నేత ఖర్చే భారీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకే రోజూ పెద్ద మొత్తంలో చెల్లించుకుంటున్నారని జనసేన నాయకులు చర్చించుకుంటున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
Advertisement