Sakshi News home page

గంగూలీకి ధోని పూర్తి భిన్నం

Published Sun, Nov 23 2014 9:27 AM

గంగూలీకి ధోని పూర్తి భిన్నం

వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్య

 కోల్‌కతా: భారత క్రికెట్ చరిత్రలో సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనిలకు అత్యంత విజయవంతమైన కెప్టెన్లుగా పేరుంది. అయితే స్వభావరీత్యా వీరిద్దరూ పూర్తి వ్యతిరేమని మాజీ టెస్టు ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. అలాగే తన బ్యాటింగ్ తీరుతో ఈడెన్ టెస్టులో ఆస్ట్రేలియాను మట్టికరిపించడం తీపి జ్ఞాపకమని చెప్పాడు. హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో గంగూలీతో పాటు లక్ష్మణ్ పాల్గొన్నాడు. ‘ఫాలోఆన్ కోసం బరిలోకి దిగినప్పుడు నేను పెద్దగా ఏమీ ఆలోచించలేదు.

సాధ్యమైనంత మేర  క్రీజులో అధిక సమయం గడపాలని భావించాను. అయితే 2003లో అడిలైడ్ టెస్టులో నేను, ద్రవిడ్ కలిసి ఏర్పరిచిన భాగస్వామ్యం ఇంకా కీలకమైంది. ఇక గంగూలీ స్వభావరీత్యా భావోద్వేగాలను అణుచుకోలేడు. ప్రస్తుత కెప్టెన్ ధోని తనకు వ్యతిరేకం. చాలా ప్రశాంతంగా కనిపిస్తుంటాడు. అలాగే సీనియర్ ఆటగాళ్లతో అతడు చక్కగా కలిసిపోయేవాడు. మేమంతా రిటైర్ అయ్యాక కూడా ధోని జట్టును సరైన ట్రాక్‌లో పెట్టాడు’ అని లక్ష్మణ్ అన్నాడు.

Advertisement

What’s your opinion

Advertisement