ఉరుటూరు నుంచి నాలుగో రోజు యాత్ర | Sakshi
Sakshi News home page

ఉరుటూరు నుంచి నాలుగో రోజు యాత్ర

Published Thu, Nov 9 2017 8:53 AM

praja sankalpa yatra third day starts Uruturu - Sakshi

సాక్షి, జమ్మలమడుగు: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో రోజు ప్రజాసంకల్పయాత్రను వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఉరుటూరు శివారు నుంచి ప్రారంభించారు. గురువారం ఉదయం 8.40 గంటలకు ఆయన నాలుగో రోజు యాత్ర మొదలు పెట్టారు. ఆయన వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడి నుంచి సర్వరాజపేట మీదుగా పెద్దన్నపాడు చేరుకున్నారు. జగనన్నపై అభిమానులు పూలవర్షం కురిపించారు. అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. తర్వాత వైకోడూరు జంక్షన్‌లో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అన్నదాతలను అన్నివిధాల ఆదుకుంటామని హామీయిచ్చారు.

ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలిలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ రోజు పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ 10.9 కిలోమీటర్లు నడవనున్నారు. ఎర్రగుంట్ల శివారులో ఈరోజు యాత్ర ముగించనున్నారు. ఇప్పటివరకు మూడురోజులు పాదయాత్ర పూర్తి చేసిన ఆయన 39 కిలోమీటర్లు నడిచారు.

   నేటి పాదయాత్ర షెడ్యూల్‌

Advertisement
Advertisement