చంద్రబాబు క్షమాపణ చెప్పాలి | Sakshi
Sakshi News home page

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

Published Wed, Nov 15 2017 3:21 AM

Chandra Babu should apologize says ysrcp leaders - Sakshi

విజయవాడ సిటీ: పవిత్ర సంగమాన్ని చూడకపోతే పాపం అని పదేపదే లేనిపోని ప్రచారంచేసి 22 నిండుప్రాణాలు బలిగొన్న సీఎం చంద్రబాబుప్రజలకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వెలంపల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. అందుకు బాధ్యులైన టూరిజం మంత్రి అఖిలప్రియ, ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమా రాజీనామా చేయాలన్నారు. లేదంటే ఘటనకు నైతిక బాధ్యత వహించి చంద్రబాబే వారిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

విజయవాడ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నగర వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ మల్లాది విష్ణు, రాష్ట్ర అధికార ప్రతినిధి పైలా సోమినాయుడు కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాధ్యతలు మరిచి కేవలం ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ను తిట్టడానికి మాత్రమే ఉన్నట్లు వ్యవహరించే ఇరిగేషన్‌ మంత్రి ఉమా.. కృష్ణా నదిలో బోటు మునిగి 22 మంది ప్రాణాలు కోల్పోతే ఈ క్షణం వరకు స్పందించలేదని ధ్వజమెత్తారు. బోటు దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20లక్షల పరిహారంతో పాటు, ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పైలా సోమినాయుడు డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement