ఒంటిపై ఖాకీ చొక్కా... చేతిలో తుపాకీ... తప్పుడు పనులు చేసినోళ్లకు చుక్కలు చూపిస్తాడీ ఖాకి’. సింపుల్‌గా పోలీసుల పవరేంటో? చూపిస్తాడంటున్నారు ‘ఆదిత్య మ్యూజిక్’ అధినేత ఉమేశ్ గుప్తా. కార్తీ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘ధీరన్ అధిగారమ్ ఒండ్రు’ను తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఖాకి’గా తీసుకొస్తున్నారాయన. ద పవర్ అఫ్ పోలీస్... అనేది చిత్రఉపశీర్షిక. సంగీత ప్రపంచంలో 20 ఏళ్లుగా అగ్రగామిగా కొనసాగుతున్న ఆదిత్య మ్యూజిక్ ప్రై.లి. సంస్థ ఈ సినిమాతో చిత్రనిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ– ‘‘2005లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది.
ఇందులో కార్తీ పవర్ఫుల్ పోలీస్‌గా కనిపిస్తారు. లుక్స్, ఫిజిక్ వైజ్‌గా జాగ్రత్తలు తీసుకుని చేశారు. కథ వినగానే తెలుగు ప్రేక్షకులకు చూపించాలని రైట్స్ తీసుకున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో టీజర్‌ను, జిబ్రాన్ స్వరపరిచిన పాటల్ని, ఆ తర్వాత చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా, అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్ ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూరన్, కూర్పు: శివనందీశ్వరన్, ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్, డ్యాన్స్: బృంద, సంగీతం: జిబ్రాన్, నిర్మాతలు: ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా.
పోలీస్ పవర్ చూపించే ఖాకి
Published Wed, Sep 13 2017 12:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement