జెర్సీ నెం.36 | Sakshi
Sakshi News home page

జెర్సీ నెం.36

Published Sat, Jun 16 2018 12:57 AM

nani new movie jersey - Sakshi

2010లో రిలీజ్‌ అయిన ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాలో నాని గ్రౌండ్‌లోకి కూతకి దిగి ఊరికి కప్పు గెలిచిన విషయం తెలిసిందే. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత స్పోర్ట్స్‌ డ్రామా సినిమాను టచ్‌ చేయనున్నారు నాని. ‘మళ్ళీ రావా’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దరకత్వంలో నాని హీరోగా రూపొందనున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘జెర్సీ’. ఇందులో క్రికెటర్‌గా కనిపించనున్నారు నాని. జెర్సీ నెం. 36 ధరించి, గ్రౌండ్‌లో బౌండరీల వర్షం కురిపిస్తారట.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ ప్రెస్టీజియస్‌ మూవీ కోసం నానీతో అసోసియేట్‌ అవ్వడం ఆనందంగా ఉంది. ‘జెర్సీ’ సినిమా ఫుల్‌ ఎమోషనల్‌గా, ఎప్పుడూ చూడని విజువల్స్‌తో ఉండబోతోంది’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో మల్టీస్టారర్‌ మూవీలో యాక్ట్‌ చేస్తున్నారు నాని. ఆ సినిమా కంప్లీట్‌ అవ్వగానే ‘జెర్సీ’ నెం.36 ధరిస్తారాయన.

Advertisement
Advertisement