Sakshi News home page

అణ్వాయుధ దేశంగా గుర్తించాలి: ఉత్తర కొరియా

Published Sun, Sep 11 2016 3:56 PM

అణ్వాయుధ దేశంగా గుర్తించాలి: ఉత్తర కొరియా - Sakshi

సియోల్: తమ దేశాన్ని చట్టబద్ధమైన అణ్వాయుధ దేశంగా అమెరికా గుర్తించాలని ఉత్తర కొరియా డిమాండ్ చేసింది. ఇటీవల దేశ చరిత్రలోనే అతిపెద్ద అణ్వాయుధ పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా ఆదివారం ఈ మేరకు డిమాండ్ చేసింది. ఉత్తర కొరయా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కేసీఎన్ఏ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. తమ దేశాన్ని చట్టబద్ధమైన అణ్వాయుధ దేశంగా గుర్తించకుండా ఉండటానికి ఒబామా ప్రయత్నిస్తున్నారని.. అయితే ఇది అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపాలనుకోవడం లాంటి తెలివితక్కువ చర్య అని అన్నారు.

ఇటీవల జరిపిన అణు పరీక్షలను ఉత్తర కొరియా మరోసారి సమర్థించుకుంది. అమెరికా నుంచి అణుముప్పు ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో చేపట్టిన చర్యగా ఆయన తెలిపారు. న్యూక్లియర్ ఫోర్స్ పరిమాణం, సామర్థ్యాన్ని పెంచుకుంటామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement