Sakshi News home page

'వారణాసి రోడ్ షోలో బయటివాళ్లే ఎక్కువ'

Published Fri, Apr 25 2014 1:02 PM

'వారణాసి రోడ్ షోలో బయటివాళ్లే ఎక్కువ' - Sakshi

లక్నో: ప్రధాని పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయని బహుజన సమాజ్వాది పార్టీ(బీఎస్పీ) నాయకురాలు మాయావతి విమర్శించారు. తర్వాతి ప్రధాని ఎవరనే దానిపైనే కాంగ్రెస్, బీజేపీ దృష్టి సారించారని... ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. వారణాసిలో కాకుండా అమేథీలో రాహుల్ గాంధీపై నరేంద్ర మోడీ ఎందుకు పోటీ చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ రహస్య ఒప్పందం చేసుకున్నాయని మాయావతి ఆరోపించారు.

వారణాసిలో మోడీ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా నిర్వహించిన రోడ్ షో పాల్గొన్నవారిలో ఎక్కువ మంది బయటనుంచి వచ్చినవారేనని తెలిపారు. ఉమా భారతి ముందు తన నియోజకవర్గంలో నెగ్గి,  తర్వాత ఇతర స్థానాల గురించి మాట్లాడాలని సూచించారు. ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని మాయావతి అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement