గ్రహం అనుగ్రహం (16-06-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (16-06-2020)

Published Tue, Jun 16 2020 6:31 AM

Daily Horoscope in Telugu (16-06-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం తిథి బ.ఏకాదశి పూర్తి(24గంటలు) నక్షత్రం అశ్వని పూర్తి(24గంటలు) వర్జ్యం రా.1.33 నుంచి 3.18 వరకు దుర్ముహూర్తం ఉ.8.06 నుంచి 8.58 వరకు తిరిగి రా.10.55 నుంచి 11.38 వరకు అమృతఘడియలు..రా..10.01 నుంచి 11.46 వరకు

సూర్యోదయం :    5.29
సూర్యాస్తమయం    :  6.31
రాహుకాలం :  ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

గ్రహఫలం
మేషం: పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు.  పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

సింహం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యభంగం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా కొనసాగుతాయి.

కన్య: కొత్త విషయాలు తెలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

తుల: కొత్త పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు అందుతాయి. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొత్త ఆశలు. దైవదర్శనాలు చేసుకుంటారు.

వృశ్చికం: పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. సన్నిహితులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. వస్తులాభాలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం: పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. చిత్రమైన సంఘటనలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

Advertisement
Advertisement