-
25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్‌లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
News about Hardeep Singh Nijjar, murder and S Jaishankarభారత్‌లోని అఫ్గనిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనపై వ్యక్తిగత దాడులు, నిరంతర పరువునష్టం తన రాజీనామాకు కారణమని ఆమె పేర్కొన్నారు. మహిళా ప్రతినిధిని లక్ష్యంగా చేసుకొని తనపై దాడులు జరిగాయని వార్దక్ అన్నారు.ముంబైలో ఆఫ్ఘనిస్తాన్ కాన్సుల్ జనరల్‌గా ఉండటంతో పాటు న్యూఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక రాయబారి బాధ్యతలను కూడా జకియా వార్దక్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆమె ముంబై విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. దాదాపు రూ 18 కోట్ల విలువైన బంగారాన్ని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి భారత్‌కు తన వస్త్రాల్లో తరలించారని, ముమ్మర తనిఖీలు చేయగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడిందని అధికారులు పేర్కొన్నారు. ముంబయిలో ఏప్రిల్ 25న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జకియా వార్ధక్ శనివారం తెలిపారు.కాగా వార్ధక్ బంగారాన్నిఅక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు. ఏప్రిల్ 25న ఆమె తన కుమారుడితో కలిసి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి ముంబయికి చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత గ్రీన్ ఛానల్ నుంచి ఎయిర్‌పోర్టు బయటకు వచ్చారు. దౌత్యవేత్త కావడంతో ఆమెును తనిఖీలు చేయలేదు. అయితే, ఎయిర్‌పోర్టు ఎగ్జిట్ వద్ద డీఆర్ఐ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. తొలుత స్మగ్లింగ్ ఆరోపణల గురించి ప్రశ్నించగా.. ఆమె వాటిని తోసిపుచ్చారు. అనంతరం ఆమెను గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించగా... ఆమె దుస్తుల్లో ఏకంగా 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఒక్కో కడ్డీ బరువు కేజీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలను ఆమె సమర్పించకపోవడంతో అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇలాంటి స్మగ్లింగ్ కేసుల్లో అనుమానితులను వెంటనే అరెస్టు చేస్తారు. అయితే వార్ధక్‌కు దౌత్యపరమైన రక్షణ ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకోలేదు.News about Hardeep Singh Nijjar, murder and S Jaishanka -
కిరాతక భర్త అరెస్టు
కృష్ణరాజపురం: నగరంలోని కోరమంగళలో భార్యను రోడ్డుపై హత్య చేసి పరారైన కిరాతక భర్తని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఆగ్నేయ డీసీపీ సి.కే.బాబా తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 2వ తేదీన కోరమంగళ పరిధిలోని వెంకటపురలో హత్య జరిగింది. ఇందు (28) ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తూ నివసిస్తోంది. ఆమె భర్త మైకేల్ ఫ్రాన్సిస్ (33), వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రాన్సిస్ పెయింటర్‌గా పనిచేస్తూ జులాయిగా తిరిగేవాడు. దీంతో ఐదు నెలల కిందట భార్య పుట్టింటికి వచ్చేసింది. ఫ్రాన్సిస్ ఆ రోజు భార్య వద్దకు వచ్చి గొడవపడి ఆమెను రోడ్డుపైనే పొడిచి చంపి పరారయ్యాడు. పోలీసులు విచారణ జరిపి నిందితున్ని అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలే హత్యకు కారణమని చెప్పారు. -
డిప్యూటీ సీఎం బూడి హత్యకు కుట్ర
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు ఇంటి వద్ద డ్రోన్ కెమెరాతో నలుగురు రెక్కీ నిర్వహించడం వివాదాస్పదమైంది. గ్రామస్తులు వారిని పట్టుకుని, తమ నేత బూడి ముత్యాలనాయుడుç ßæత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులకు అప్పగించారు. ముత్యాలనాయుడు ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ జోక్యం చేసుకోవడంతో వివాదం ముదిరింది.రాత్రి వరకు హైడ్రామా నడిచింది. దేవరాపల్లి మండలం తారువలోని బూడి ఇంటి చుట్టూ శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారు. అరగంటకు పైగా ముత్యాలనాయుడు ఇంటి పరిసరాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు డ్రోన్ ఆపరేటర్లను ఆరా తీశారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ డి.నాగేంద్ర గ్రామానికి చేరుకుని డ్రోన్, బీజేపీ జెండా సహా హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ ఆపరేటర్ చిలకల పాండురంగారావు, అసిస్టెంట్ ఆపరేటర్ పొట్టి సాయికృష్ణ, చొప్ప గంగాధర్, కొమర అప్పారావులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. తన హత్యకు కుట్ర పన్నారని, అనుమతులు లేకుండా తన ఇంటి చుట్టూ డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారని ముత్యాలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రమేష్ ఎదురుదాడి విషయం తన అనుచరుల ద్వారా తెలుసుకున్న సీఎం రమేష్ డ్రోన్ ఆపరేటర్లను తారువ గ్రామస్తులపై ఎదురు ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. సాయంత్రం 4 గంటల సమయంలో అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో దేవరాపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన బూడి వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముత్యాలనాయుడు ఇంటి వద్దకు వెళ్లేందుకు సీఎం రమేష్ సిద్ధం కాగా.. పోలీసులు నిరాకరించారు. రౌడీమూకల మాదిరిగా పోలీసులను నెట్టుకుంటూ తన వెంట ఉన్న పచ్చ దండుతో రమేష్ తారువకు వెళ్లారు. ముత్యాలనాయుడి మరో ఇంటి వద్దకు (ఆ ఇంట్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముత్యాలనాయుడి కుమారుడు రవికుమార్ ఉంటున్నారు) వెళ్లగా.. రమేష్ వస్తున్న విషయం తెలుసుకుని ముత్యాలనాయుడు ఆ ఇంటి వద్ద తన అనుచరులతో బైఠాయించారు. ఈ ఇల్లు కూడా తన పేరిట ఉందని, ఎవరొస్తారో చూస్తానని హెచ్చరించారు. విషయం తెలుసుకుని అవాక్కయిన సీఎం రమేష్ తన అనుచరులతో కలిసి హనుమాన్ ఆలయం ముందు మెట్లపై కూర్చుండి పోయారు. తారువ గ్రామస్తులు, వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని తమ ఊళ్లో రౌడీ రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు వెళ్లిపోవాలని కోరడంతో సీఎం రమేష్ పోలీసు జీపు ఎక్కారు. దీంతో రమేష్ ఎక్కిన జీపునకు అడ్డంగా గ్రామస్తులు బైఠాయించారు. గూండాగిరీ చేసిన సీఎం రమేష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో అరగంటకు పైగా సీఎం రమేష్ ఎక్కిన పోలీసు వాహనం నిలిచిపోయింది. ఆ వాహనాన్ని గ్రామస్తులు చుట్టముట్టడంతో సీఎం రమే‹Ù, అతని అనుచరవర్గం భయంతో వణికిపోయారు. పోలీసులు అతికష్టంపై రమేష్ ఎక్కిన వాహనాన్ని ముందుకు పంపించగా.. గ్రామస్తులు మాత్రం ఊరి పొలిమేర దాటే వరకు వెంబడించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
కదిరి అర్బన్: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం జౌకల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీ కార్యకర్త నాగభూషణం (38) దారుణహత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులే ఈ పని చేసి ఉంటారని హతుడి సోదరి చంద్రమ్మ కదిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే నాగభూషణం అవివాహితుడు. శుక్రవారం కూడా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ప్రచారం ముగిశాక రాత్రి తన ఇంటిముందు నిద్రించాడు. గాఢనిద్రలో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడిచేసి అతి దారుణంగా చంపేశారు. ఘటనాస్థలాన్ని కదిరి పట్టణ సీఐ పుల్లయ్య పరిశీలించారు. హతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులతో మాట్లాడారు. జిల్లా కేంద్రం నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన తమ్ముడు నాగభూషణాన్ని గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు జయచంద్రనాయుడు, గోవర్దన్‌నాయుడు, జయరాంనాయుడు, జయరాం చంపి ఉంటారని అతడి అక్క చంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీళ్లంతా తనను గ్రామంలో ఉండనీయబోమని వీళ్లు బెదిరిస్తున్నట్లు హిందూపురంలో ఉన్న తనకు నాగభూషణం ఫోన్‌చేసి చెప్పినట్లు తెలిపారు. తాను వచ్చి మాట్లాడతానని సముదాయించానని, అంతలోపే కిరాతంగా చంపే«శారని విలపించారు. చంద్రమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగభూషణం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద వైఎస్సార్ïÙపీ సీఈసీ సభ్యుడు, కదిరి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు పూల శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నాగభూషణం హంతకుల్ని పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హతుడి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన వెంట ఎంపీపీ అమరనాథ్‌రెడ్డి, జేఏసీ కన్వినర్ మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. -
క్షణికావేశం.. ఇద్దరు మహిళల ప్రాణం తీసింది!
సిర్పూర్(టి): క్షణికావేశం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసింది. భార్యాభర్తల మధ్య గొడవతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణమంటూ ఆమె భర్త కుటుంబ సభ్యులు దూషించడంతో ఎదురింట్లో ఉండే మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సిర్పూర్(టి) ఎస్సై డికొండ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని బెస్తకాలనీకి చెందిన గాజిరెడ్డి రమ(35)ను భర్త గాజిరెడ్డి సురేష్ గత కొంతకాలంగా అనుమానంతో వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో రమ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతిచెందింది.ఆత్మహత్యకు కారణమంటూ..ఇదే కాలనీలో దోని సరిత(30) రమ ఎదురు ఇంట్లో నివాసం ఉంటుంది. రమ, సరిత ఇళ్లు ఎదురెదురుగా ఉండడంతో పరిచయస్తులు. కాగా, తన భార్య రమకు సరిత మాయమాటలు చెబుతుండడంతోనే రోజు గొడవలు జరుగుతున్నాయని, ఈ గొడవల కారణంగానే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని సురేష్, కుటుంబ సభ్యులు సరితను అసభ్యకరంగా దూషించారు. దీంతో మనస్తాపం చెందిన సరిత శనివారం ఉదయం క్షణికావేశంలో వెంట్రుకలకు వేసుకునే కలర్ తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. వైద్యుల సూచన మేరకు కాగజ్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది.కేసు నమోదుగాజిరెడ్డి సురేష్ గత ఏడాది కాలంగా తన కూతురు రమను అనుమానిస్తూ చిత్రహింసలకు గురి చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లి ఒడ్డెటి పోశక్క పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గాజిరెడ్డి సురేష్, ఆయన తల్లి గుండమ్మ, చెల్లె పద్మ అవమానకరంగా దూషించడంతోనే తన భార్య దోని సరిత ఆత్మహత్య చేసుకుందని భర్త దోని రాజేందర్ ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement