వారెవా.. రైనా వాట్ ఏ క్యాచ్!
టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా అనగానే అభిమానులకు గుర్తొచ్చేది ఫీల్డింగ్‌లో వేగం, స్టన్నింగ్ క్యాచ్‌లు. గత కొంత కాలంగా సరైన ఫామ్‌లో లేక సతమతమవుతున్న రైనా టీమిండియాలో చోటు కొల్పోయాడు. దీంతో అతడి మెరుపులు చూసే అవకాశం అభిమానులు తెగ మిస్ అవుతున్నారు. అయితే రంజీ మ్యాచ్‌లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్- ఒడిశా మ్యాచ్‌లో రైనా కళ్లు చెదిరే రీతిలో ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దానికి సంబంధించిన వీడియా రైనా స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ స్టార్ ఫీల్డర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ‘రైనా ఇజ్ బ్యాక్’, ‘ఫీల్డింగ్‌లో రైనాకు సాటి లేరు’ అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి