మహిళ ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్‌ ఎస్సై చోరవ | Sakshi
Sakshi News home page

మహిళ ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్‌ ఎస్సై చోరవ

Published Mon, Dec 2 2019 5:05 PM

ఓ ట్రాపిక్‌ ఎస్సై ధైర్యసాహసాలు ప్రదర్శించి.. చురుగ్గా స్పందించి ఓ మహిళ ప్రాణాలను కాపాడాడు. కృష్ణలంక సమీపంలోని బందరు కాల్వలో ఓ మహిళ అదుపుతప్పి పడిపోయింది. కాల్వలో కొట్టుకుపోతున్న ఆమెను గుర్తించి స్థానికులు కేకలు వేశారు. కాపాడాలని అర్థించారు. అటుగా వెళుతున్న ట్రాఫిక్‌ ఎస్సై అర్జున్‌ దీనిని గుర్తించారు. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను చూసి వెనుకాముందు ఆలోచించకుండా కాల్వలోకి దూకేశారు. ఈదుకుంటూ వెళ్లి మహిళను ఓడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు.