యూపీని చూసి నేర్చుకోండి: యోగీ | Sakshi
Sakshi News home page

యూపీని చూసి నేర్చుకోండి: యోగీ

Published Wed, Oct 4 2017 3:39 PM

ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగి కేరళ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీజేపీ నేతృత్వంలో జరుగుతున్న జనరక్ష యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన కేరళ ముఖ్యమంత్రి విజయన్‌పై యోగీ విరుచుకుపడ్డారు. కేరళలో హింస పెరిగిపోతోందని, దాన్ని సహించే ప్రసక్తే లేదని యోగి స్పష్టం చేశారు. కేరళ ప్రభుత్వం హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందని, వాటికి ప్రజాస్వామ్యంలో చోటులేదన్నారు. విజయన్‌ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని విస్మరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో విషజ్వారాలు ప్రభలుతున్నాయనని, వాటిని నివారించడానికి ఇప్పటి వరకూ తగిన చర్యలు కూడా తీసుకోలేదని విజయన్‌పై మండిపడ్డారు. డెంగ్యూ కారణంగా ఇప్పటి వరకూ 300మంది చనిపోయారని ఆరోపించారు. చికున్‌ గున్యాతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని, అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఆయన విమర్శించారు. యూపీ ఆస్పత్రులను చూసి కేరళ ప్రభుత్వం నేర్చుకోవాలని యోగీ, విజయన్‌కు సూచించారు.