'సాక్షి' స్పోర్ట్స్ ఎడిటర్ హఠాన్మరణం | Sakshi
Sakshi News home page

'సాక్షి' స్పోర్ట్స్ ఎడిటర్ హఠాన్మరణం

Published Sat, Dec 3 2016 7:21 AM

సీనియర్ జర్నలిస్ట్, ‘సాక్షి’ స్పోర్ట్స్ ఎడిటర్ బత్తినేని జయప్రకాశ్ (38) శుక్రవారం ఆకస్మికంగా కన్నుమూశారు. తీవ్ర గుండె పోటుతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జయప్రకాశ్‌కు భార్య శిరీష, ఇద్దరు పిల్లలు రేవంత్ (7), సాయి దేదీప్య (3) ఉన్నారు. శుక్రవారం విధులకు హాజరయ్యేందుకు సన్నద్ధమవుతుండగా.. బాత్రూంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లినా అప్పటికే మరణించారు.

Advertisement
 
Advertisement
Advertisement