Sakshi News home page

బెంగ తీర్చిన భరోసా

Published Fri, Mar 29 2024 2:10 AM

- - Sakshi

● జిల్లాలో 70,611 మందికి వైఎస్సార్‌ మత్స్యకార భరోసా లబ్ధి ● ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.70.61 కోట్ల మేర పంపిణీ

అరసవల్లి:

డలినే నమ్ముకున్న మత్స్యకారుల కష్టాన్ని గుర్తించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర హామీని ఐదేళ్లూ అమలు చేసి అండగా నిలిచారు. ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 అర్ధరాత్రి వరకు సముద్రంలో వేట నిషేధ కాలం అమలౌతున్న నేప థ్యంలో మత్స్యకారులకు భరోసాగా జీవన భృతి కింద ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల నగదును నేరుగా వారి ఖాతాల్లో జమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పేరిట పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలిగా మత్స్యకారులకే ఈ పథకాన్ని వర్తింపజేస్తూ డీబీటీ ద్వారా నగదు జమ చేసింది. గంగపుత్రుల బెంగ తీర్చేలా వేటనిషేధ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన భరోసాపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దళారుల బెడద లేకుండా..

వేట నిషేధ కాలంలో 11 మండలాలకు చెందిన మత్స్యకారులకు వైఎస్సార్‌ మత్స్యకార భరోసా వర్తింపజేశారు. గతంలో ఇచ్చిన రూ.4 వేల భృతిని ఏకంగా రూ.10 వేలకు పెంచారు. రేషన్‌ కార్డుకు ఒకరు చొప్పున ప్రతి మోటార్‌ బోటుకు యజమాని తో సహా ఆరుగురు చొప్పున, నాన్‌ మోటరైజ్డ్‌ బోటుకు యజమానితో సహా ముగ్గురు మత్స్యకారులకు ఈ భరోసా పథకాన్ని వర్తింపజేశారు. మొత్తంగా 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 70,611 మంది వేట మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70.61 కోట్లు నగదు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఎక్కడా మధ్యవర్తుల జోక్యం లేకుండా ప్రభుత్వం డీబీటీ ద్వారా నగదు జమ చేయడంతో అర్హులంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట

మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేలా జగనన్న ప్రభుత్వం పనిచేసింది. మా మత్స్యకారుల వలసలకు అడ్డుకట్ట వేసేందుకు, జిల్లా ముఖచిత్రం మార్చేందుకు మూలపేటలో భారీపోర్టు, బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో పిషింగ్‌ హార్బర్లు నిర్మాణాలు చేపడుతోంది. వచ్చే ఏడా ది మళ్లీ జగనన్నే సీఎం హోదాలో వీటిని ప్రారంభించాలని కోరుకుంటున్నాం.

– కోనాడ నరిసింగరావు, డీఎఫ్‌సీఎస్‌ అధ్యక్షుడు

ఐదుసార్లు అందుకున్నా...

వేటకు నిషేధ సమయంలో గత ప్రభుత్వం మాకు రూ. 4 వేలు ఇచ్చేది. ఈ ప్రభు త్వం వచ్చిన తర్వాత వరుసగా ఐదేళ్లుగా రూ.10 వేలు చొప్పున భృతి అందించారు. మధ్యవర్తు ల ప్రమేయం లేకుండా భృతి అందిస్తూ మత్స్యకారుల సంక్షేమ, ఉపాధికి ఈ ప్రభుత్వం బాగా పనిచేసింది. మళ్లీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం.

– బైపల్లి రామారావు, మత్స్యకారుడు,

ఇసకలపాలేం

Advertisement

What’s your opinion

Advertisement