హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు | Sakshi
Sakshi News home page

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

Published Mon, Dec 3 2018 12:38 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో సోమవారం హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేపట్టారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు ఎందుకు అప్పగించలేదని నిలదీసింది. ఈ కేసును ఎన్‌ఐఏకు ఎందుకు బదిలీ చేయలేదో చెప్పాలని, పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ ధాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.