Sakshi News home page

తోటపల్లితో ఊరట

Published Wed, Mar 27 2024 1:00 AM

మహదేవివలస–గోపాలపురం మధ్యలో పూర్తయిన ఎడమకాలువ కాంక్రీట్‌ లైనింగ్‌ పనులు - Sakshi

వీరఘట్టం: ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతుల ఆశల సౌధం తోటపల్లి జలాశయం. ఈ జలాశయంలోని పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పనులపై గత టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపకపోవడంతో టీడీపీ పాలనలో రైతులు తీవ్ర కరుపు పరిస్థితులను ఎదుర్కొన్నారు. 2019లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో ఉన్న వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేస్తూ పాత ఆయకట్టు ఆధునికీకరణ పనులకు జీవం పోశారు. వైఎస్సార్‌సీపీ పాలనలో గత ఐదు ఖరీఫ్‌ సీజన్లలో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రణాళికాబద్ధంగా నీటి పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా ఓ పక్క కాలువల ఆధునికీకరణ పనులు చేపడుతూనే మరో పక్క సాగునీటి పంపిణీ చేస్తూ సాగును సస్యశ్యామం చేశారు. అంతేకాకుండా గత టీడీపీ పాలనలో అరకొరగా చేపట్టిన పనులకు కూడా సుమారు రూ.13 కోట్ల బిల్లులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. అయితే వాస్తవ పరిస్థితులను విస్మరిస్తూ తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులపై ‘అయిదేళ్లూ చాల్లేదా’ అనే విషపు కథనాన్ని మంగళవారం ‘ఈనాడు’ పత్రిక ప్రచురించింది.

చేపట్టిన పనులు కనిపించలేదా..?

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాలో తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులను ఐదేళ్లుగా ప్రణాళికా బద్ధంగా చేపడుతూ, మరో వైపు ఖరీఫ్‌లో పుష్కలంగా సాగునీరందించిన విషయాలు ఈనాడుకు కనిపించకపోవడం శోచనీయమని రైతులు అంటున్నారు. 37.536 కి.మీలు పొడవున్న ఎడమకాలువలో ఇంతవరకు 16.843 కి.మీ వరకు కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయి.అలాగే 17.616 కి.మీ పొడవున్న కుడికాలువలో 9.376 కి.మీ వరకు కాంక్రీట్‌ పనులు చేపట్టారు. మొత్తం 55.152 కి.మీలకు గాను ఇంత వరకు 26.919 కి.మీ అంటే సుమారు 45 శాతం పనులు చేపట్టారు. అంతేకాకుండా ఎడమకాలువలో అచ్చపుపలస వద్ద,6వ బ్రాంచ్‌ వద్ద, ఎం.రాజపురం వద్ద, కత్తులకవిటి వద్ద వెడల్పయిన వంతెనలు నిర్మించి వాహన రాకపోకలకు మార్గం సుగమం చేశారు. నీటి పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గత ఖరీఫ్‌లో చర్యలు చేపట్టి శివారు వరకు సాగునీరందించారు. ఒక పక్క ఆధునికీకరణ పనులు చేపడుతూ మరో పక్క గత ఐదు ఖరీఫ్‌ సీజన్లలో సకాలంలో కాలువలకు సాగునీరందిస్తూ ప్రభుత్వం తోటపల్లి ఆయకట్టును సస్యశ్యామలం చేస్తుంటే తోటపల్లి కాలువ పనులపై ఈనాడు తప్పుడు వార్తలు రాస్తుండడం ఎంత వరకు సమంజసమని జలవనరులశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

గత టీడీపీ పాలన అంతా కరువే...

గత టీడీపీ పాలనలో తోటపల్లి ఆయకట్టు రైతులు తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొన్నారు మరి ఆ విషయాలను ఎందుకు ఈనాడు రాయడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. 2014లో టీడీపీ అధికారం చేపట్టిన ఏడాదే అక్టోబర్‌ 8 నుంచి 14 వరకు హుదూద్‌ తుఫాన్‌ విళలయ తాండవం చేస్తూ వరి పంటకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.ఈ తుఫాన్‌లో పంటలు నష్టపోయిన నిజమైన రైతులను విస్మరించి టీడీపీ నాయకులు వారి బినామీల పేర్లు నమోదు చేసి పంటల నష్ట పరిహారాన్ని స్వాహా చేశారు. అలాగే 2015లో నవంబర్‌లో చావ్లా తుఫాన్‌ ప్రభావంతో పంటలకు నష్టం కలిగింది. మరుసటి ఏడాది 2016 ఆగస్టు 18న తోటపల్లి ఎడమకాలువలో పెద్దబుడ్డిడి వద్ద ఉన్న బిట్రిష్‌ కట్టడం సైఫన్‌ కు భారీగా గండిపడింది. దీంతో సైఫన్‌కు దిగువన ఉన్న 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ప్రశ్నార్ధకంగా మారడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే 2017 ఖరీఫ్‌లో ఫణి తుఫాన్‌ పంటలను అతలాకుతం చేసింది. 2018లో అక్టోబర్‌ 8 నుంచి 12 వరకు సంభవించిన తిత్లీ తుఫాన్‌ ధాటికి పంటలు సమూలంగా నేలమట్టమయ్యాయి. ఇలా 2014 నుంచి 2018 వరకు చంద్రబాబు పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా కరువు ఏర్పడడంతో పాటు తోటపల్లి పాత ఆయకట్టు రైతులు కూడా తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రాలేదు. 2019లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తోటపల్లి కాలువలకు ఆదరాబాదరాగా నిధులు మంజూరు చేసి వీరఘట్టం మండలం అచ్చెపువలస వద్ద శంకుస్థాపన పనులు చేట్టి రైతులను మోసగించే ప్రయత్నం చేసింది. గత టీడీపీ పాలనతో విసిగిన రైతులు 2019లో టీడీపీకి బుద్ధి చెప్పి వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారు.

ఆయకట్టుకు జీవం పోసిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి

ఐదేళ్లుగా పాత ఆయకట్టుకు

పుష్కలంగా నీరు పంపిణీ

వాస్తవాలను పక్కన పెట్టి ఈనాడు తప్పుడురాతలు

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న

జలవనరులశాఖ అధికారులు

Advertisement

What’s your opinion

Advertisement