ప్రముఖ యాప్‌లో కాల్‌రికార్డింగ్‌ ఫీచర్‌..

Truecaller Launches AI Powered Call Recording - Sakshi

స్వీడిష్ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ ఇండియాలో ట్రాన్స్‌‌‌‌క్రిప్షన్  కాల్ సమ్మరీని అందించే ఏఐ పవర్డ్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌‌‌‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ట్రూకాలర్ ప్రీమియం సబ్‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌తో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్​, ఐఓఎస్‌ డివైజ్‌ల్లో పనిచేస్తుందని పేర్కొంది. 

కొత్తగా పరిచయం చేసిన ఈ ఫీచర్‌ ద్వారా ఇన్‌‌‌‌కమింగ్, అవుట్‌‌‌‌గోయింగ్ కాల్స్‌ను నేరుగా ట్రూకాలర్​ యాప్‌‌‌‌లో రికార్డ్ చేసుకోవచ్చు. కాల్‌ వివరాలను హిందీ, ఇంగ్లిష్​ భాషల్లో మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. 

ఇదీ చదవండి: ఆండ్రాయిడ్‌లో రానున్న అద్భుతమైన అప్‌డేట్‌లు..

ప్రీమియం ప్లాన్‌లు ఇలా..
ట్రూకాలర్‌ బ్రాండ్ ప్రీమియం ప్లాన్‌‌‌‌లో భాగంగా ఏఐ ఆధారిత కాల్ రికార్డింగ్ సొల్యూషన్ కోసం నెలకు రూ.75 లేదా సంవత్సరానికి రూ.529 చెల్లించాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ రిషిత్ జున్‌‌‌‌జున్‌‌‌‌వాలా చెప్పారు.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top