Sakshi News home page

ఈ రాశివారికి ధనప్రాప్తి..

Published Fri, Feb 5 2021 6:07 AM

Daily Horoscope In Telugu 5-2-2021 - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి బ.అష్టమి ఉ.11.35 వరకు, తదుపరి నవమి నక్షత్రం విశాఖ రా.7.59 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం రా.11.41 నుంచి 1.10 వరకు, దుర్ముహూర్తం ఉ.8.49 నుంచి 9.34 వరకు, తదుపరి ప.12.35 నుంచి 1.20 వరకు అమృతఘడియలు... ఉ.11.45 నుంచి 1.14 వరకు.

సూర్యోదయం :    6.35
సూర్యాస్తమయం  :  5.53
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

రాశి ఫలాలు:
మేషం: ఆర్థికాభివృద్ధి. సన్నిహితుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ముఖ్యసమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

వృషభం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. ధనప్రాప్తి. సమాజంలో విశేష గౌరవం. ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. విచిత్ర సంఘటనలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ప్రయాణాలలో మార్పులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో విజయం. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

కన్య: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడనక సాగుతాయి.

తుల: ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. ఆర్థిక లాభాలు. కొత్తమిత్రుల పరిచయం. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

వృశ్చికం: చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు న త్తనడకన సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

ధనుస్సు: ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.

మకరం: ఆకస్మిక ధనలబ్ధి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు.

Advertisement

What’s your opinion

Advertisement