Sakshi News home page

బుర్జ్ ఖలీఫా నుంచి కిందకు దూకిన ఇద్దరు యువకులు

Published Wed, Apr 23 2014 5:51 PM

బుర్జ్ ఖలీఫా నుంచి కిందకు దూకిన ఇద్దరు యువకులు

ప్రపంచంలోని ఎత్తైన మానవ నిర్మిత కట్టడం బుర్జ్ ఖలీఫా నుంచి ఇద్దరు బేస్ జంపర్లు కిందకి దూకి ప్రపంచ రికార్డును బద్దలుగొట్టారు. దుబాయిలోని 828 మీటర్ల ఎత్తైన బుర్జ్ ఖలీఫా పై నుంచి విన్స్ రెఫెట్, ఫ్రెడ్ ఫుగెన్ అనే ఇద్దరు ఫ్రెంచ్ ప్రొఫెషనల్ బేస్ జంపర్లు కిందకు దూకారు.

2010 లో నాసిర్ అల్ నెయాదీ, ఒమర్ అల్ హెగెలాన్ అనే ఇద్దరు యూఏఈ యువకులు 672 మీటర్ల ఎత్తునుంచి క్రిందకు దుమికారు. ఇదే ఇప్పటి వరకూ ప్రపంచ రికార్డు. ఇప్పుడు ఫ్రెంచ్ యువకులు ఈ రికార్డును బద్దలుగొట్టారు. వీరిద్దరూ పసుపు రంగు జంప్ సూట్లు ధరించారు. వీటికి గాలికి ఉబ్బిపోయి, రెక్కల్లా పనిచేసే పరికరాలు అమర్చి ఉంటాయి. వీటి వల్ల పక్షుల్లా ఎగిరి కిందకు దిగొచ్చు.
బేస్ జంపింగ్ అంటే బిల్డింగ్, యాంటిన్నా, స్పాన్ ల నుంచి కిందకి దూకడం లేదా నేల పై నుంచి అగాధంలోకి దూకడం. బిల్డింగ్ నుంచి బి, యాంటిన్నా నుంచి ఏ, స్పాన్ నుంచి ఎస్, ఎర్త్ నుంచి ఈ లను తీసుకుని బేస్ అన్న పదాన్ని సృష్టించారు.

Advertisement

What’s your opinion

Advertisement