Sakshi News home page

పందెం కోడి..పారా హుషార్..!

Published Sat, Apr 18 2015 6:36 PM

భాస్కర్ రావు ఇంటికొచ్చిన కొత్త వ్యక్తిపై దాడి చేస్తున్న కోడిపుంజు

సాధారణంగా పందెం కోడి పనేంటి? పంగడ వేళల్లో ఎదుటి పుంజులపై పౌరుషాన్ని ప్రదర్శిస్తూ యజమానికి పేరు తీసుకొస్తుంది. అంతకు మించి యజమానికి మరిన్ని సేవలు చేస్తూ పందెం కోడి.. పారాహుషార్ అనిపిస్తున్న ఈ కోడి గురించి తెల్సుకుందాం.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురానికి చెందిన భాస్కర్ రావుకు ఓ కోడి పుంజు ఉంది. ప్రస్తుతం అది కాపలా కోడి అవతారం ఎత్తింది. ఇంటి యజమాని అనుమతి లేకుండా ఆవరణలోకి ఎవరైనా వస్తే ఎగిరెగిరి తన కొచ్చెటి ముక్కుతో పొడుస్తుంది. అపరిచితులను భయపెట్టి పరుగులు తీయిస్తోంది.

భాస్కరరావు, కుటుంబ సభ్యులు, బంధువులను మాత్రం ఏమీ అనదు! ఆనోటా ఈనోటా ఈ కోడి సంగతి నలుగురికీ తెలియడంతో భాస్కరరావు ఇంటికి సందర్శకుల సంఖ్య పెరిగింది. పుంజు చేష్టలను చూసి జనం అబ్బురపడుతున్నారు. కోడి పుంజులను పెంచడం తన హాబీ అని, ఈ కోడికి ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని, దానికదే ఇంటికి కాపలా కాస్తోందని భాస్కర్ రావు చెబుతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement