
టీమిండియాతో ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయం కారణంగా రెండు టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అధికారికంగా దృవీకరించాడు. తో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. వీసా సమస్య కారణంగా తొలి టెస్టుకు దూరమైన బషీర్.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు సిద్దమవుతోన్నాడు.
ఇప్పటికే జట్టుతో కలిసిన బషీర్ తన సహాచర ఆటగాళ్లతో కలిసి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జాక్ లీచ్ దురదృష్టవశాత్తూ వైజాగ్ టెస్టుకు దూరమయ్యాడు. అతడి కుడి కాలిలో వాపు వచ్చింది. జాక్ దూరం కావడం మాకు గట్టి ఎదురుదెబ్బ. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాక అతడికి ఇలా జరగడం బాధాకరమని చెప్పకొచ్చాడు.
ఇక బషీర్ అరంగేట్రం కోసం స్టోక్సీ మాట్లాడుతూ.. షోయబ్ బషీర్ డెబ్యూపై మేము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ అతడికి అవకాశం వస్తే మాత్రం దీనిని తన కెరీర్‌లో మరుపురాని టెస్టుగా మార్చేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఏ ఆటగాడికైనా అరంగేట్ర టెస్టు ఆడే అవకాశం ఒక్కసారి మాత్రమే వస్తుంది కదా.
పిచ్ పరిస్థితిని అంచనా వేసి కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, వైస్ కెప్టెన్ ఓలీ పోప్‌తో చర్చించి తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటాం. బషీర్ స్క్వాడ్‌లో ఉన్నాడు. అతడిని మేము అనుభవం కోసం ఇక్కడకు తీసుకురాలేదు. అతడి అవసరం మాకుందని భావిస్తే కచ్చితంగా తుది జట్టులో ఛాన్స్ ఇస్తామని పేర్కొన్నాడు.
చదవండి: Sachin Tendulkar: వరుసగా రెండుసార్లు డకౌట్.. సాకులు చెప్పా.. ఆ ఒక్క పరుగు వల్ల