చైనాను అందుకోవాలంటే.. 10% వృద్ధి అవసరం

India economy will have to grow at 10 per cent to catch up with China - Sakshi

భారత్‌ జీ20 షెర్పా అమితాబ్‌ కాంత్‌  

న్యూఢిల్లీ: చైనా ఆర్థిక వ్యవస్థ పరిమాణం  ప్రస్తుతం  భారతదేశం కంటే ఐదు రెట్లు ఉందని, చైనా స్థాయి ని మన దేశం చేరుకోవాలంటే 10 శాతం వృద్ధి సాధన అవసరమని భారత్‌ జీ20 షెర్పా అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్న ఆయన,  రాబోయే మూడు దశా బ్దాల్లో 8–9 శాతం వృద్ధిరేటు సాధన దేశానికి సవాలుగా మారుతుందని పేర్కొన్నారు.

పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోర మ్‌ ఆఫ్‌ ఇండియా (పీఏఎఫ్‌ఐ) ఇక్కడ ఏర్పా టు చేసిన ఒక కార్యక్రమంలో కాంత్‌ మాట్లాడుతూ, ప్రైవేట్‌ రంగం మద్దతు లేకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అధిక రేటు వృద్ధి సాధన అసాధ్యమని అన్నారు. భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న  సంగతి తెలిసిందే. 25.5 ట్రిలియన్‌ డాలర్లతో అమెరికా ప్రస్తు తం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది.

ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్‌ డాలర్ల ఎకాన మీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్‌ (4.2 ట్రిలియన్‌ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్‌ డాలర్లు)లు ఉన్నాయి. 3.5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీతో భారత్‌ ఐదవ స్థానంలో నిలుస్తోంది. 2022 నాటికి భారత్‌ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. 2030 నాటికి జపా న్‌ ఎకానమీని సైతం  భారత్‌ అధిగమించగలదని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ వంటి సంస్థలు కొన్ని విశ్లేషిస్తున్నాయి.  

విమానయానంలో యూరప్‌ను మించి...
మౌలిక రంగానికి ప్రభుత్వం పటిష్ట మద్దతునిస్తోందన్నారు. యూరప్‌లోని విమానాశ్రయాల కంటే భారతీయ విమానాశ్రయాల నాణ్యత మెరుగ్గా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానయాన సంస్థల కంటే మన దేశీయ విమానయాన సంస్థలు కూడా మెరుగ్గా ఉన్నాయని ఆయన అన్నారు.  

ఏఐ కీలక పాత్ర
భారతదేశ వృద్ధి పటిష్టత చెక్కుచెదర కుండా ఉంటుందని భరోసా ఇచి్చన అమితాబ్‌ కాంత్, స్థిరమైన వృద్ధిని తీసుకురావడానికి ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ని ఉపయోగించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగించకుండా, సాంకేతిక రంగలో పురోగతి అసాధ్యమని సైతం ఈ సందర్బంగా పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top