
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను 336 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టిన భారత జట్టు.. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తమ తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది.
దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో గిల్ సేన సమం చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆదేశ మాజీ క్రికెటర్ మైఖేల్ అథర్టన్ విమర్శల వర్షం కురిపించాడు. స్టోక్స్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడని, కెప్టెన్‌గా తన మార్క్ చూపించలేకపోతున్నాడని అథర్టన్ మండిపడ్డాడు. కాగా తొలి టెస్టులో పర్వాలేదన్పించిన స్టోక్స్.. రెండో టెస్టులో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అటు వ్యక్తిగత ప్రదర్శన పరంగా.. ఇటు కెప్టెన్సీలోనూ విఫలమయ్యాడు.
"ఈ సిరీస్‌కు బెన్ స్టోక్స్‌కు కఠిన పరీక్ష వంటింది. స్టోక్స్ గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా అతడి బ్యాటింగ్ ఫామ్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజు రోజుకు అతడి బ్యాటింగ్ ఫామ్ దిగజారుతూ వస్తోంది.
వన్డే, టీ20లకు దూరంగా ఉంటూ స్టోక్స్ కేవలం టెస్టుల్లో ఆడుతూ వన్-ఫార్మాట్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అతడు జట్టును ఒక ప్రణాళికపరంగా ముందుకు నడిపించలేకపోతున్నాడు. అతడి పేలవ ఫామ్ కెప్టెన్సీపై ఇంపాక్ట్ చూపుతోంది. అంతేకాకుండా స్పిన్నర్లను ఆడటానికి ఇబ్బంది పడుతున్నాడు.
కానీ ప్రత్యర్ధి కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాత్రం అద్బుతంగా రాణిస్తున్నాడు. తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరిస్తునప్పటకి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. లార్డ్స్‌లో జరగనున్న మూడో టెస్టులో కూడా భారత్ నుంచి ఇంగ్లండ్‌కు గట్టి సవాల్ ఎదురుకానుంది.
ఈ మ్యాచ్‌లో స్టోక్స్ కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడన్నది చాలా ముఖ్యంమని" ది టైమ్స్ కాలమ్‌లో అథర్టన్ పేర్కొన్నాడు. కాగా టెస్టుల్లో స్టోక్స్ సెంచరీ చేసి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇక ఇంగ్లండ్-భారత్ మధ్య మూడో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs ENG: భారత్‌తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! కెప్టెన్ ఈజ్ బ్యాక్