ఎవరు చెప్పారు మా పార్టీ చీలిపోయిందని? ఆయన ఇప్పటికీ మా పార్టీ లీడరే.. శరద్ పవార్

Sharad Pawar Makes Massive Claim Says No Split In NCP - Sakshi

ముంబై: కొద్దీ రోజుల క్రితం అధికార శివసేన-బీజేపీ పార్టీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన అజిత్ పవార్ ఇప్పటికీ మా పార్టీకి చెందిన వారేనన్నారు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్. ఆయన రాజకీయంగా మాతో విభేదించినంత మాత్రాన మా పార్టీలో చీలిక వచ్చిందని ఎలా అంటారని ప్రశ్నించారు. 

కొల్హాపూర్ వెళ్లేముందు పూణే బారామతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తమ పార్టీలో ఎలాంటి చీలిక రాలేదని తాము ఇప్పటికీ కలిసే ఉన్నామన్నారు. అజిత్ పవార్ పార్టీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంపై మేము అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని సభాపతి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. దీన్ని ఆధారం చేసుకుని మా పార్టీలో చీలిక వచ్చిందని ఎలా చెబుతారు? ఆయన ఇప్పటికీ మా పార్టీకి చెందినవారేనని అన్నారు. 

జాతీయ స్థాయిలో భారీ సంఖ్యలో నాయకులు పార్టీ నుండి వేరైతే దాన్ని పార్టీలో చీలిక రావడమంటారు. మా పార్టీలో అలాంటిదేమీ జరగలేదు కదా. కొంతమంది మా పార్టీని విడిచి వెళ్లారు. మరికొంతమంది రాజకీయంగా మాతో విభేదించారు. ప్రజాస్వామ్యంలో సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు అందరికీ ఉంటుందన్నారు. 

నేను సర్వేలు ఇంకా అధ్యయనం చేయలేదు కానీ ఎన్సీపీ- శివసేన(యూబీటీ) మహా వికాస్ అఘాడిపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తోపాటు మరికొన్ని పార్టీలతో కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కంటే మెరుగ్గా రాణిస్తుందని అన్నారు. శరద్ పవార్ కంటే ముందు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా అజిత్ పవార్ తమ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే అని ఆయన ఇంకా మా పార్టీతోనే ఉన్నారని అన్నారు.    

ఇది కూడా చదవండి: చంద్రుడిపై ప్రజ్ఞాన్‌ రోవర్ అడుగుపెట్టిన దృశ్యాలు  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top