Setback for Sharad Pawar All 7 Ncp Mlas in Nagaland to Support Ajit Pawar - Sakshi
Sakshi News home page

Sharad Pawar: ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ

Jul 20 2023 8:42 PM | Updated on Jul 20 2023 9:33 PM

Setback For Sharad Pawar All 7 NCP MLAs In Nagaland To Support Ajit Pawar - Sakshi

ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నాగాలాండ్‌లో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు అజిత్‌ పవార్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నాగాలాండ్‌కు చెందిన పార్టీ నేతలంతా అజిత్ పవార్‌కు మద్దతు తెలుపుతున్నాం’ అని ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. . 

కాగా, జూలై 2న ఎన్సీపీని రెండుగా చీల్చిన అజిత్‌ పవార్‌ 30-35 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. అందులో అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే తిరుగుబాటు అనంతరం కూడా అజిత్‌.. శరద్‌ పవార్‌తో రెండుసార్లు భేటీ కావడం విశేషం.. తన వర్గం నేతలతో కలిసి ముంబయిలోని శరద్‌ పవార్‌ నివాసానికి చేరుకొని, పార్టీని ఐక్యంగా ఉంచే విషయంపై ఆయనతో చర్చించారు. తమ విజ్ఞప్తిని విన్న శరద్‌ పవార్‌.. మౌనంగా ఉన్నారే తప్ప ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదని రెబల్‌ ఎమ్మెల్యేలు వెల్లడించారు.
చదవండి: మణిపూర్‌లో మహిళల నగ్న ఊరేగింపు.. ఆరోజు జరిగింది ఇదేనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement