టీచర్లు తలుచుకుంటే సర్కార్‌ తలరాతలు మారిపోతాయి: బండి సంజయ్‌ | Minister Bandi Sanjay Key Comments Over Telangana Teachers | Sakshi
Sakshi News home page

టీచర్లు తలుచుకుంటే సర్కార్‌ తలరాతలు మారిపోతాయి: బండి సంజయ్‌

Sep 8 2024 2:24 PM | Updated on Sep 8 2024 2:24 PM

Minister Bandi Sanjay Key Comments Over Telangana Teachers

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణలో ఉద్యోగులకు నెల మొదటి వారంలో జీతాలు పడటం బీజేపీ పోరాట ఫలితమేనని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్‌. అలాగే, రాష్ట్రంలో టీచర్లు తలుచుకుంటే సర్కార్‌ తలరాతలే మారిపోతాయన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు టీచర్లకు ఏం మంచి జరిగిందని ప్రశ్నించారు.

కాగా, కరీంనగర్‌లో తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురువందనంలో పాల్గొని ఉత్తమ టీచర్లను ​కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ..‘రాష్ట్రంలో టీచర్లు అందరూ రోడ్లపైకి వచ్చి కొట్లాడండి. విద్యార్థుల సమస్యలపై గళం విప్పండి. టీచర్లు తలుచుకుంటే సర్కార్‌ తలరాతలు మారిపోతాయి. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యబద్దంగా పోరాడే వాళ్లకు నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తాను.

కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే టీచర్లకు ఏం మంచి జరిగింది?. మీ కోసం మేం పోరాడి జైలుకు వెళితే కాంగ్రెస్‌ను గెలిపించడం ఎంతవరకు సమంజసం?. ఉద్యోగులకు మొదటి వారం జీతం బీజేపీ పోరాట ఫలితమే. 317 జీవోతో టీచర్లు అల్లాడితే ఉపాధ్యాయ సంఘాల ఎందుకు నోరు విప్పలేదు?. టీచర్ల పక్షాన కొట్లాడి జైలుకు వెళ్లిన ఏకైక సంఘం తపస్ మాత్రమే. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డికి జోడీని గెలిపించండి. బీఈడీ అర్హతలున్న ఎస్జీటీ టీచర్లకు ప్రమోషన్లను న్యాయం జరిగేలా కృషి చేస్తాను. పాఠ్యాంశాల్లో నక్సలైట్ల సిద్దాంతాలను, కమ్యూనిస్టు మూలాలను చొప్పించే కుట్ర జరుగుతోంది. సమాజాన్ని భ్రష్టు పట్టించే కుట్రలను ఛేదించాలి’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement