మొసలికి వ్యక్తి బలి?
రాయచూరు రూరల్ : రాయచూరు తాలూకాలో కృష్ణా నదిలో మొసలికి సణ్ణనాగప్ప (66) అనే వ్యక్తి బలైనట్లు ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. శనివారం గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాయచూరు తాలూకా అరిషిణిగికి చెందిన సణ్ణ నాగప్ప గత ఏడాది మే నెలలో కృష్ణా నదిలోకి స్నానం కోసం దిగాడన్నారు. ఆ సమయంలో ఆకస్మికంగా మొసలి అతనిని బలి తీసుకున్నట్లు అనుమానం ఉందని, గ్రామీణ పోలీసులు ఈ విషయపై కేసు నమోదు చేసుకుని, అతని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఇద్దరు నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన చోరీ కేసుల్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. శనివారం సింధనూరు తాలూకా తుర్విహాళ్ పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. తుర్విహాళ్‌కు చెందిన జిలాని, శివరాజ్‌ల నుంచి 3 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదం
రాయచూరు రూరల్: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైందని ఎన్‌ఎస్‌ఎస్ అధికారి డాక్టర్ మహేష్ పేర్కొన్నారు. ఆయన యాదగిరి జిల్లా శహాపుర బాలికల కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు మనస్సు పెట్టి చదివేలా ఉపాధ్యాయులు విద్యాభోదన చేయించాలన్నారు. పాఠాలకు తోడు పాఠ్యేతర అంశాలపై విద్యార్థులు శ్రద్ధ కనబరచాలన్నారు. సమావేశంలో సిద్దణ్ణ, శేఖరప్ప, అనిత, ధర్మనగౌడలున్నారు.
గెలిచిరా ఇండియా.!
● హాస్టల్ విద్యార్థుల ఆశాభావం
హుబ్లీ: టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబోలో భారత్–పాకిస్తాన్‌ల మధ్య జరుగనున్న క్రికెట్ మ్యాచ్‌లో ఇండియా గెలిచి రావాలని భారతీయులు ఎంతో ఆశగా ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో దావణగెరె జిల్లాలో కూడా ప్రార్థనలు, శుభాకాంక్షలు మిన్నంటాయి. ఈ మ్యాచ్ టీ20 ఇండియా జట్టును అభినందించిన ఆ జిల్లా హొన్నాళిలోని డాక్టర్ అంబేడ్కర్ హాస్టల్‌లోని విద్యార్థులు పాకిస్థాన్‌పై ఇండియా జట్టు గెలిచి స్వదేశానికి రావాలని భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయ బృందంతో నినాదాలు చేస్తూ అభినందనలు తెలియజేశారు. భారత్, పాకిస్తాన్ జట్లు 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటికే ఒక్కొక్క జట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడాయి. రెండింటిలోను గెలిచారు. భారత్ తొలి మ్యాచ్ యూఎస్‌ఏపైన, రెండో మ్యాచ్ నమీబియాపైన ఆడి గెలుపు సాధించిన సంగతి తెలిసిందే.
ఆ ఆత్మహత్య వెనుక
చేదు నిజాలెన్నో.!
హుబ్లీ: ధార్వాడలో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చావు వెనుక కొరియన్ గేమ్‌ల అతి వ్యసనం ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు తన చావుకు తానే కారణం అని మృతుడు సెల్‌లో మెసేజ్ పంపాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ధార్వాడ ఉప నగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా సర్వత్రా బహిరంగ చర్చకు ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమైంది. ఈ నెల 6న ధార్వాడ నగర మంగళగట్టి ప్లాట్ నివాసి వికాస్ నాయక్(20) తన ఇంట్లో ఉరి వేసుకొన్నాడు. దీనిని అసహజ మరణంగా అప్పట్లో అనుమానించారు. కాగా మృతుడు పీయూసీ సైన్స్ పూర్తి చేసి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంట్లోనే సన్నద్ధత చేసుకొనేవాడు. అయితే తన మొబైల్ గేముల్లో ప్రత్యేకించి కొరియన్ గేమ్‌లపై అతిగా ఆసక్తి పెంచుకున్నట్లు తెలిసింది. ఇంట్లో వారికి తెలియకుండా చాలా సమయాన్ని గేమ్‌లు ఆడటంలోనే గడిపేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు
రాయచూరు రూరల్ : కాగితాలతో కూడిన చిత్రాలను, పటాలను తయారు చేయడం ద్వారా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని మైసూరు సంచాలకుడు హుసేన్ పిలుపునిచ్చారు. శనివారం స్టేషన్ బజార్ హైస్కూలులో భారత జ్ఞాన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖన పోటీలను ప్రారంభించి మాట్లాడారు. చిత్రలేఖన కళ ద్వారా విద్యార్థుల మనోబలాన్ని పెంచవచ్చన్నారు. రాఘవేంద్ర, హఫీజుల్లా, సూగూరయ్య, ముత్తణ్ణ, జ్యోతి పాల్గొన్నారు.
మొసలికి వ్యక్తి బలి?
మొసలికి వ్యక్తి బలి?
మొసలికి వ్యక్తి బలి?
మొసలికి వ్యక్తి బలి?
మొసలికి వ్యక్తి బలి?


