బాన్సువాడ పీఠంపై విజయ
బాన్సువాడ : మున్సిపల్ కార్యాలయంలో సోమ వారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికై న రోజే శిబిరానికి వెళ్లిన కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉదయం 11 గంటలకు నేరుగా కార్యాలయానికి చేరుకున్నారు. వారితో సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురితోపాటు స్వతంత్ర కౌన్సిలర్ అంజాగౌడ్ గైర్హాజరయ్యారు.
చైర్‌పర్సన్ పదవి కోసం ఐదో వార్డు నుంచి ఎన్నికైన కాసుల విజయ పేరును రెండో వార్డు కౌన్సిలర్ జంగం రాజశేఖర్ ప్రతిపాదించగా 15వ వార్డు కౌన్సిలర్ వాన్‌కర్ రమేశ్ బలపర్చారు. చైర్మన్ పదవికి ఒకే నామినేషన్ రావడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు సబ్ కలెక్టర్ ప్రకటించారు. వైస్ చైర్‌పర్సన్ పదవికి 18 వ వార్డు కౌన్సిలర్ రేష్మా బేగం పేరును మూడో వార్డు కౌన్సిలర్ హకీం ప్రతిపాదించగా ఎనిమిదో వార్డు కౌన్సిలర్ దొన్కంటి శ్యామల బలపరిచారు. పోటీ ఎవరూ లేకపోవడంతో ఆమె వైస్‌చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
చైర్‌పర్సన్ పేరు : కాసుల విజయ
భర్త పేరు: కాసుల బాల్‌రాజ్
పిల్లలు: కుమారుడు కాసుల రోహిత్
వయసు: 51
విద్యార్హత: 8వ తరగతి
కులం: మున్నూరుకాపు
వృత్తి: గృహిణి
రాజకీయ నేపథ్యం: భర్త కాసుల బాల్‌రాజ్ కాంగ్రెస్ నాయకుడు. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్‌గా ఉన్నారు.
వైస్‌చైర్‌పర్సన్ పేరు: రేష్మా బేగం
భర్త: ఎజాస్
పిల్లలు: మహ్మద్ ఇషానొద్దీన్, మహ్మద్ దిల్షానొద్దీన్
వయసు: 40
విద్యార్హత: 10వ తరగతి
కులం: మైనారిటీ (బీసీ)
వృతి: గృహిణి
రాజకీయ నేపథ్యం: ఎంపీపీగా పనిచేశారు.
బాన్సువాడ పీఠంపై విజయ


