ఎల్లారెడ్డి చైర్మన్‌గా పద్మ శ్రీకాంత్‌ | - | Sakshi
Sakshi News home page

ఎల్లారెడ్డి చైర్మన్‌గా పద్మ శ్రీకాంత్‌

Feb 17 2026 7:28 AM | Updated on Feb 17 2026 7:28 AM

ఎల్లా

ఎల్లారెడ్డి చైర్మన్‌గా పద్మ శ్రీకాంత్‌

ఎల్లారెడ్డి చైర్మన్‌గా పద్మ శ్రీకాంత్‌

ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌గా పద్మ శ్రీకాంత్‌, వైస్‌ చైర్‌పర్సన్‌గా మత్తమాల భాగ్యవతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి, ఆర్డీవో పార్థసింహారెడ్డి ప్రకటించారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో కార్యక్రమంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. ముందుగా కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌గా పద్మ శ్రీకాంత్‌ పేరును రెండో వార్డు కౌన్సిలర్‌ మంచిర్యాల మహేశ్వరి ప్రతిపాదించగా, ఒకటో వార్డు కౌన్సిలర్‌ తమ్మల గాయత్రి బలపరిచారు. చైర్మన్‌ పదవికి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవమైనట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం వైస్‌ చైర్‌పర్సన్‌ పదవికి మత్తమాల భాగ్యవతి పేరును తొమ్మిదో వార్డు కౌన్సిలర్‌ గాదె తిరుపతి ప్రతిపాదించగా, ఆరో వార్డు కౌన్సిలర్‌ మహ్మద్‌ గఫార్‌ బలపర్చారు. ఈ పదవికీ పోటీ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం వారితో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మహేష్‌కుమార్‌ వారికి అభినందనలు తెలిపారు.

చైర్‌పర్సన్‌ పేరు : పద్మ శ్రీకాంత్‌

తండ్రి పేరు: దశరథం

పిల్లలు: రిశ్మిత, బ్రాహ్మణి

వయసు: 46

విద్యార్హత: ఇంటర్‌

కులం: పద్మశాలి

వృత్తి: వ్యాపారం

రాజకీయ నేపథ్యం: గతంలో ఎల్లారెడ్డి వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్‌గా, ఎంపీటీసీగా పనిచేశారు.

2020లో ఎల్లారెడ్డి పదో వార్డు కౌన్సిలర్‌గా గెలిచారు. 2024లో మూడు నెలల పాటు మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్నారు.

వైస్‌చైర్‌పర్సన్‌ పేరు: మత్తమాల భాగ్యవతి

భర్త పేరు: జీవన్‌గౌడ్‌

పిల్లలు: ప్రశాంత్‌గౌడ్‌, ప్రమోద్‌గౌడ్‌, శ్వేత

విద్యార్హత: పదో తరగతి

కులం: గౌడ

వృత్తి: గృహిణి

రాజకీయ నేపథ్యం: లేదు.

ఎల్లారెడ్డి చైర్మన్‌గా పద్మ శ్రీకాంత్‌1
1/1

ఎల్లారెడ్డి చైర్మన్‌గా పద్మ శ్రీకాంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement