రసవత్తరంగా కుస్తీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా కుస్తీ పోటీలు

Feb 18 2026 7:02 AM | Updated on Feb 18 2026 7:02 AM

రసవత్తరంగా కుస్తీ పోటీలు

రసవత్తరంగా కుస్తీ పోటీలు

లింగంపేట(ఎల్లారెడ్డి): కొర్పోల్‌ గ్రామంలోని హరిహర దేవాలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఏటా మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. టెంకాయ కుస్తీ నుంచి చివరి నగదు కుస్తీ వరకు ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. సర్పంచ్‌ కమ్మరి ఏగొండ, జీపీ పాలకవర్గం పాల్గొన్నారు.

నస్రుల్లాబాద్‌: సంగం గ్రామంలోని సంగమేశ్వర ఆలయం వద్ద మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మల్లయోధులకు ఆలయ కమిటీ సభ్యులు నగదు బహుమతి ఇచ్చి సన్మానించారు. మాజీ ఎంపీపీ పాల్త్య విఠల్‌, నాయకులు వినోద్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

బిచ్కుంద(జుక్కల్‌): శివరాత్రిని పురస్కరించుకొని బిచ్కుంద బండాయప్ప మఠం ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మల్లయోధులకు నగదు బహుమతి అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement